ఆసియా, ఒలింపిక్ క్రీడల్లో భారత్ ఎక్కడ ! లోపం క్రీడాకారులదా, పాలకులదా !! కర్రలు, త్రిశూలాల శిక్షణపై కాషాయదళాలకు ఉన్న శ్రద్ద ఆటలపై ఎందుకు లేదు !!!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు జపాన్‌లోని అచినగాయాలో 20వ ఆసియా గేమ్స్ ముగిశాయి. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు నాలుగువరకు జరిగిన క్రీడల్లో 45 దేశాలు, ఒక సంస్థ నుంచి 10,787 మంది క్రీడాకారులు పాý£్గన్నారు.దాదాపు సగం మంది మహిళలు పాల్గ్గొన్నారని అంచనా. ఈ పోటీలకు 56 కోట్ల డాలర్లు ఖర్చు కాగా 30శాతం ప్రాయోజిత సంస్థ నుంచి నిధులు వచ్చాయి.చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించగా భారత్ గతం కంటే తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా భావించే బంగారు పతకాల సాధనలో వెనుకబడింది. గతంలో జనాభా విషయంలో ముందున్న చైనాను మనదేశం వెనక్కు నెట్టింది.ఇరు దేశాలూ దాదాపు ఒకే సంఖ్యలో జనాలను కలిగి ఉన్నప్పటికీ చైనా తాజా ఆసియా క్రీడల్లో 169 బంగారు పతకాలతో సహా మొత్తం 341 గెలుచుకోగా మనం 21 స్వర్ణాలతో సహా అన్నీ కలిగిపి 85 మాత్రమే తెచ్చుకొని నాలుగవ స్థానంలో నిలిచాం.మనతో సమంగా ఒక చిన్నదేశం ఉజ్బెకిస్తాన్ 21 స్వర్ణాలు సాధించింది. ఆసియా క్రీడలు, ఒలింపిక్ పోటీలలో మనదేశ క్రీడాకారులు సాధించిన విజయాలను కచ్చితంగా అభినందించాల్సిందే.అనేక మంది అనుభవాలు, పట్టుదలను చూసినపుడు వారి స్వయంకృషి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పోల్చితే ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు తీరుతెన్నులను అంతే కరాఖండితంగా విమర్శించాల్సిందే. అన్ని దేశాలూ ఇలానే ఉన్నాయా ? లేవు. చైనా సాధిస్తున్న ఆర్థిక విజయాలను చూసి అది నిరంకుశ ప్రభుత్వమండీ, బలవంతగా చేయిస్తారు అని సొల్లు కబుర్లు చెప్పే పడక కుర్చీరాయుళ్లు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు. పోనీ మిగతా దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు అనుకుంటే ఆ దేశాల మాదిరి మనం ఎందుకు సాధించటం లేదు. నూతన ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు, పరిశోధకులను గుర్తించటం, ప్రోత్సాహకాలు ఎలా అవసరమో క్రీడాకారులకూ అదే వర్తిస్తుంది.ఈ పని ఎవరు చేయాలి ? జపాన్ పోటీలకు వెళ్లిన ఒక యువతి తన బూట్లు, ఇతర అవసరాల కోసం మేకలను అమ్ముకోవాల్సి వచ్చిందన్న వార్తలను చదివిన తరువాత ఈ దేశానికి ఏమైంది, పాలకులు, ఉన్నత అధికార యంత్రాంగానికి చర్మం అంత మెక్కిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అంతన్నాడింతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లుగా ఖేలో ఇండియా, ఇతరంగా ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణలో అదేమీ కనిపించటం లేదు. నూతన ఆవిష్కరణలు, క్రీడల్లో ప్రతిభాపాటవాలు ఎంతగా ప్రదర్శితమైతే అంతగా ప్రపంచంలో దేశ ప్రతిష్ట ఇనుమడించుతుంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ పాలనా కాలంలో అడుగంటిన దేశ ప్రతిష్టను పునరుద్దరించినట్లు ప్రధాని నరేంద్రమోడీ కబుర్లు చెప్పారు. ప్రధమ ప్రధాని నెహ్రూ 34 పర్యటనల్లో 42దేశాలు(194764, పదిహేడు సంవత్సరాలు) తిరిగి వస్తే అనేక మంది విమర్శించినట్లుగా ఖరీదైన దుస్తులు వేసుకొని నరేంద్రమోడీ ఇది రాసిన సమయానికి(2026 అక్టోబరు మొదటివారం) 104 ట్రిప్పుల్లో 82దేశాలు తిరిగారు. మన్మోహన్ సింగ్ ఏలుబడిలో దేశ పరువు ఎన్ని పాయింట్లకు దిగజారిందో మోడీ ఎంతకు పెంచారో ఎప్పుడూ చెప్పింది లేదు. ఇంత పెద్ద దేశం మోడీ అధికారానికి వచ్చిన తరువాత జరిగిన ఆసియా, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తీరు ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచిందో, తగ్గించిందో మోడీ వీరభక్తులు చెప్పాలి.


మనదేశంలో ఏటా క్రీడలకు కేటాయిస్తున్న సొమ్ము 40 నుంచి 53 కోట్ల డాలర్లవరకు ఉంది. అదే చైనాలో 2,000 నుంచి 3,300 కోట్ల డాలర్లు. ఇంత తక్కువ కేటాయిస్తే పోడియం సంగతి దేవుడెరుగు అసలు పోటీల్లో పాల్గ్గొనేందుకు మనకు అర్హత వస్తుందా అన్నది ప్రశ్న. చైనాలో చిన్నా, పెద్ద స్టేడియాలు 1,70,000 ఉండగా మనదేశంలో వెయ్యి స్టేడియాలు, వాటిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నది కేవలం వందచోట్ల మాత్రమే.పెద్ద మొత్తంలో రాబడి వచ్చే క్రికెట్ స్టేడియాల గురించి చెప్పనవసరం లేదు, పోనీ వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఇతర క్రీడలకు వెచ్చిస్తున్నారా అంటే అదీ లేదు. చైనాలో నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న బాలబాలికలలో ఉన్న ప్రతిభను దేశవ్యాపితంగా గుర్తించి వారిలో జిమ్నాస్టులుగా ఎవరు పనికి వస్తారు, ఎత్తు అవసరమైన వాలీబాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడలకు ఎవరు అన్నది గుర్తించి వారిని ప్రత్యేకమైన క్రీడా పాఠశాలలకు పంపుతారు. క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారి గౌరవ ప్రదమైన జీవితాలకు చైనాలో ఎలాంటి ఢోకా ఉండదు.అక్కడి కోచ్‌లు పూర్తి కాలపు ప్రభుత్వ ఉద్యోగులు, వారు తయారు చేసే అధ్లెట్లను బట్టి వారికి వేతనాలు, ఉద్యోగోన్నతులు ఉంటాయి. ఖేలో ఇండియా పథకాన్ని 2017లో ప్రారంభించారు.దేశాన్ని ప్రపంచ క్రీడాశక్తిగా మారుస్తామని చెప్పారు. అంతకు ముందున్న పథకాలన్నింటినీ దీన్లో విలీనం చేశారు.బడ్జెట్ కేటాయింపులు నామమాత్రం. నిపుణులు, పార్లమెంటరీ కమిటీలు ఈ పథకం విఫలమైందన్న విమర్శల తరువాత 202631 సంవత్సరాల మధ్య రు.36,441 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంతకు ముందు ఏటా వెచ్చిస్తున్నది 1,3001,600 కోట్లు మాత్రమే ఉంది. గత మÖడు సంవత్సరాలలో తగిన సామర్ద్య ప్రదర్శనలేదని, డోపింగ్ సమస్యలతో 1,342 మంది అథ్లెట్లను పధకం నుంచి బయటకు పంపినట్లు ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. తగిన ప్రణాళికలు, కేంద్రంరాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవటంతో నిర్దిష్ట కార్యక్రమాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవటం, ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఒక పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొన్నది.క్రీడాకారులకు రవాణా, ఆహారం సమకూర్చటం వంటి అంశాల్లో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. నిధుల కేటాయింపు లేకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రయోజనం లేదు.మన దేశంలో క్రీడలకు ఏటా తలసరి ఖర్చు కేవలం రు.24 మాత్రమే. చైనా దీనికి ఎనిమిది రెట్లు, ఆస్ట్రేలియా 30రెట్లు, అమెరికా అంతకంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. ఉదాహరణకు 202425లో మనదేశంలో కేంద్రం, రాష్ట్రాలు కేటాయించిన మొత్తం రు.12,50014,600 కోట్ల మధ్య ఉండగా చైనా 85వేల నుంచి లక్ష కోట్లు కేటాయించింది.చైనా క్రీడా పరిశ్రమ విలువ 750 బిలియన్ డాలర్ల నుంచి లక్ష కోట్ల వరకు ఉండగా మనదేశంలో 1520 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది.ఈ కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన సబ్సిడీలు భారీ ఎత్తున పెరిగాయి.


ఇటీవలి కాలంలో వివిధ అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారుల రికార్డులు పేలవంగా ఉన్నాయి. అది యుపిఏ పాలన అయినా ఎన్‌డిఏ ఏలుబడిలో కూడా అదే తీరు.చైనా విషయానికి వస్తే 2010 నుంచి ఆసియాలో ప్రధమ, ఒలింపిక్స్‌లో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.అమెరికాను అధిగమించాలనే లక్ష్యంతో ముందుకుపోతోంది.పారిస్ పోటీలలో అమెరికాతో సమంగా బంగారు పతకాలను పొందింది. అమెరికన్లు మొత్తం 126 సాధించగా చైనీయులు 91 పొందారు.మనదేశం బంగారు పతకాలకు సుదూరంగా ఉండటమే కాదు, ఇతర పతకాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. స్వాతంత్య్రానికి ముందు మÖడు, తరువాత ఐదు స్వర్ణాలను హాకీలో సాధించాము. వ్యక్తిగతంగా అభినవ్ భింద్రా, నీరజ్ చోప్రా బంగారు పతకాలను సాధించారు. టోకియో పోటీల్లో మొత్తం ఏడు పతకాలు సాధించగా పారిస్‌లో ఆరు వచ్చాయి. గత 124 సంవత్సరాల్లో మన దేశానికి వచ్చిన మొత్తం పతకాలు కేవలం 41 మాత్రమే. ఆసియా క్రీడల్లో గతంలోనూ, తాజాగా నాలుగో స్థానంలో మనదేశం ఉంది. కమÖ్యనిస్టు చైనాను ఐక్యరాజ్యసమితిలోనే కాదు, ఒలింపిక్స్‌లో కూడా 1980వరకు గుర్తించలేదు. తొలిసారి 1984 లాస్ ఏంజల్స్‌లో ఐదు స్వర్ణాలతో బోణీ చేసింది. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో గరిష్టంగా 48 సాధించింది. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌ను తయారు చేయాలంటే పది‘పన్నెండు సంవత్సరాలు పడుతుంది. పది నుంచి పదిహేనువేల గంటలపాటు సాధన చేయాల్సి ఉంటుంది. ఇది చిన్నతనం నుంచే సాధ్యం.ఇందుకయ్యే ఖర్చు కూడా ఎక్కువే. ప్రభుత్వాలు భరిస్తే తప్ప మనవంటి దేశాల్లో సామాన్యులకు సాధ్యం కాదు. క్రీడల నుంచి రిటైరైన తరువాత గౌరవ ప్రదమైన వేతనంతో కూడిన ఉపాధి లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరమే. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేవారిలో 35 నుంచి 40శాతం వరకు పంజాబ్, హర్యానాల నుంచే ఉంటున్నారు. వాటి జనాభాతో పోలిస్తే ప్రాతినిధ్యం చాలా ఎక్కువ. ఇతర రాష్ట్రాలు ఎందుకు వాటి మాదిరి ప్రోత్సహించటం లేదన్నది ప్రశ్న.


ఉన్నంతలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ ముందున్నాయి.విషాదం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిఇటిలను నియమించకుండా, ప్రైవేటు పాఠశాలలకు క్రీడా స్థలాలు లేనప్పటికీ అనుమతిస్తున్న పాలకపార్టీల పెద్దలు ఉట్టికి ఎగరలేకపోయినా స్వర్గానికి తీసుకుపోతామన్నట్లుగా ఒలింపిక్స్ క్రీడల నిర్వహణల గురించి మాట్లాడుతుంటే దేంతో నవ్వాలో అర్ధం కావటం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధన టీచర్లు, పియిటిలు ఎందరుండాలో నిర్దేశించారు.సిబిఎస్‌యి అనుబంధ స్కూళ్లలో ప్రతి దశ ప్రైమరి, సెకండరీ, సీనియర్ స సెకండరీలకు ఒక్కో పియిటి ఉండాలి.ప్రతి ఐదు వందలకు ఒక పియిటి నియామకం జరగాలి. వంద మంది విద్యార్ధులున్నా ఒక పియిటి నియామకం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు నిబంధనలను పాటిస్తున్నాయి. ప్రతి ఏడు వందల మందికి ఒక పియిటి నియామకం అంటూ తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు మారిస్తే అక్కడ తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లకు ఆటస్థలాలు లేకపోయినా తలితండ్రులు ఎగబడి వాటిలో పిల్లల్ని చేర్చటం చూస్తున్నాం. తాజా యుడిఐఎసఇ (యÖనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేష్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) 2025‘26 నివేదిక ప్రకారం దేశంలో 14లక్షల 66వేల స్కూళ్లున్నాయి. మిడిల్, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్లు 5`6లక్షల ఉన్నాయనుకుంటే కనీసం అంతే సంఖ్యలో పియిటిలు అవసరం. పదిలక్షలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు ఉన్నట్లు అంచనా. ఉదాహరణకు ఒక గ్రామంలో రెండు లేదా మÖడు ప్రాధమిక పాఠశాలలు ఉంటే వాటన్నింటికీ కనీస ఒక పియిటి అయినా నియమించాలి. విషాదం ఏమిటంటే అసలు ఎందరు పిఇటిలు కావాలనే లెక్కలే మనదేశంలో లేవు. అయినా ఒలింపిక్స్ గురించి మాట్లాడతాము. విద్యారంగ నిపుణుల అంచనా ప్రకారం ప్రవేటు లేదా ప్రభుత్వ స్కూళ్లలో 1.2లక్షల నుంచి 1.5లక్షల వరకు పియిటిలు ఉన్నారు. అయితే కనీసంగా 5.5 నుంచి ఆరులక్షలు అవసరం. కర్ణాటకలో 45 తెలంగాణాలో 38శాతం స్కూళ్లలో పియిటిలు లేరన్నది ఒక సమాచారం.

ఆరఎసఎస్ సంస్థ ఆరోగ్య విభాగమే “ ఆరోగ్య భారతి ”. అది గర్భ విజ్ఞాన సంస్కారం పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. సాంప్రదాయ ఆయుర్వేద పద్దతిలో గర్భాలను శాస్త్రీయంగా శుద్ది చేసి ఉత్తమ సంతతిని పెంపొందింప చేయాలన్న ఒక ఆశాస్త్రీయ లక్ష్యాన్ని ప్రకటించారు. వారి ప్రయోగంలో పాల్గొన్న దంపతులు కనే పిల్లలు మంచి రంగు, రూపు, పొడవుగా ఉంటారని, మంచి ఆరోగ్యం, తెలివితేటలతో పాటు పూర్తి స్థాయిలో సాంస్కృతిక విలువలు కలిగి ఉంటారని చెప్పారు.మÖడు నెలల పాటు ఆ ప్రయోగంలో పాల్గొనే దంపతులు ఎప్పుడు సంయోగ ప్రక్రియలో పాల్గొనాలో, పురుషులు శుక్రకణాలు, మహిళల అండాలను ఎలా శుద్ది చేయించుకోవాలో నిర్దేశిస్తారు. ఆరఎసఎస్ చేస్తున్న ఈ ప్రయోగాల గురించి 2017లో వెల్లడి కావటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆర్యజాతిని పరిశుద్దంగా ఉంచాలంటే మలినులైన యÖదులను అంతం చేయాలని జర్మన్ హిట్లర్ వారిని ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. మనదేశంలో అలాంటి మారణకాండ సాధ్యం కాదు గనుక ఉత్తమ జాతి ప్రతిసృష్టికి ఆరఎసఎస్ పూనుకుంది. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో తాము లేదా తమ మిత్రులే అధికారంలో ఉన్నట్లు బిజెపి చెప్పుకుంటున్నది, వాస్తవం కూడా. చిన్న తనం నుంచి దేశ భక్తి పేరుతో మగపిల్లలకు కర్రలతో,దుర్గావాహిని పేరుతో ఆడపిల్లలతో కత్తులు, త్రిశూలాలు పట్టించేందుకు, హిందూత్వ రక్షణ పేరుతో మతోన్మాదాన్ని ఎక్కించేందుకు పని చేస్తున్న ఆరఎసఎస్ గత వందేండ్లుగా వారిని దేశ ప్రతిష్టను పెంచే క్రీడలవైపు ఎందుకు ప్రోత్సహించటం లేదన్నది ప్రశ్న !

చైనా- అమెరికా సంబంధాలు : షీ జింపింగ్ పర్యటన, పర్యవసానాలేమిటి !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

గత వారంలో మÖడు రోజుల పాటు చైనా అధినేత షీ జింపింగ్ అమెరికా పర్యటన జరిపారు.అసాధారణ రీతిలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో విమానం వద్దకు వెళ్లి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకటంతో అమెరికా, యావత్ ప్రపంచ మీడియా కూడా దానికి ఎంతో ప్రాచుర్యం కల్పించింది. దీర్ఘకాలం తరువాత చైనా అధినేత అమెరికా పర్యటన జరిపాడు. అప్పటికీ ఇప్పటికీ రెండు దేశాలలో ఎన్నో మార్పులు జరిగాయి. అనేక రంగాలలో అమెరికా బలహీనపడగా చైనా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.ఉభయనేతలు భిన్నమైన తమ ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణమిది.అయితే అది ఎక్కడా బహిరంగ ప్రకటనల్లో కనిపించదు. జిడిపిలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రెండు దేశాల నేతల భేటీ సాధించిందేమిటి, పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషకులు చర్చలు చేస్తున్నారు. ఉభయులు అనేక అంశాల గురించి చర్చించుకున్నప్పటికీ ఏం జరిగిందన్నది వెల్లడి కాలేదు. కొత్త ఒప్పందాలేమీ లేకపోవటం, గతంలో కుదిరిన అవగాహనలను మరో రెండు నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించటంతో యథాతధ స్థితి కొనసాగుతున్నదని కొందరు వర్ణించారు.అనేక దేశాల మీద బస్తీమే సవాల్ అంటూ వీరంగం వేస్తున్న డోనాల్డ్ ట్రంప్, ఒక దేశంగా అమెరికా చైనా విషయంలో ఆచితూచి వ్యవహరించటం వెనుక ఉన్నదేమిటి అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.

షీ జింపింగ్ పర్యటనలో ఎనిమిది అంశాలపై ఏకీభావం కుదిరిందని శనివారం నాడు చైనా ప్రకటించింది. రెండు దేశాల వ్యూహాత్మక స్థిరత్వానికి నిర్మాణాత్మకమైన గుణనిర్దేశాన్ని సాధించినట్లు వర్ణించింది. పరస్పర గౌరవం, అరమరికలు లేకుండా ఉభయదేశాల సంబంధాలను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు.ఒక పక్షం గెలిచింది, ఒక పక్షం ఓడింది అన్నట్లుగాక ఉభయులు లబ్దిపొందేందుకు అంగీకరించారు. అయితే గత చరిత్ర, అనుభవాన్ని బట్టి అమెరికా దీనికి కట్టుబడి ఉంటుందా అన్న ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అమెరికాకు అగ్రస్థానం అన్న ట్రంప్ లక్ష్యం నెరవేరాలంటే ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నించకుండా సాధ్యం కాదు.దానిలో భాగంగా అన్ని దేశాల మీద పన్నుల కొరడా ఝళిపిస్తానంటూ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరిచ్చే మర్యాదకు ప్రతిగా మేము కూడా చేస్తామని చైనా హెచ్చరించటంతో అమెరికా వెనకడుగువేయాల్సి వచ్చింది. అది వ్యూహాత్మకమా, దానికి శక్తిలేకనా అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఒక ఏడాది కాలంలో ఉభయదేశాల నేతలు ఇప్పటికే పరస్పర పర్యటనలు చేశారు.నవంబరు నెలలో చైనాలో జరిగే 21దేశాల ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార(ఎపెక్) సమావేశానికి ట్రంప్, డిసెంబరు మాసంలో అమెరికా ఆతిధ్యంతో జరిగే జి 20 సభకు షీ జింపింగ్ హాజరుకావాలని నిర్ణయించారు. అణ్వాయుధాలను సమకూర్చుకోబోమన్న అంగీకారాన్ని ఇరాన్ అమలు చేయాలని ఇద్దరు నేతలూ ఆకాంక్షించారు. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో ఏ దేశమÖ లేదా సంస్థ కూడా నౌకల రాకపోకల పన్ను వసూలు చేయకూడదని కూడా ఏకీభావం వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా, అమెరికా రెండూ మిత్రదేశాలుగా విజయం కోసం పోరాడిన అంశాన్ని గుర్తు చేసుకొని “ టోక్యో విచారణ” కు ఎనభై సంవత్సరాలు నిండుతున్నాయని, భద్రతా మండలి శాశ్వత సభ్య రాజ్యాలుగా ఉన్న చైనా, అమెరికా రెండవ ప్రపంచ యుద్దం తరువాత నెలకొన్న ప్రపంచ వ్యవస్ధకు ఇరుదేశాలూ కట్టుబడి ఉండాలని, మరోసారి సైనికవాదం తలెత్తకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.(జపాన్ రాజ్యాంగాన్ని మార్చుకొని ఆత్మరక్షణ దళాల స్థానంలో పూర్తి స్థాయి మిలిటరీని సమకూర్చుకోవాలని చూస్తున్న సంగతి, అది అమెరికా మిత్రదేశంగా ఉన్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం) వాణిజ్య విషయానికి వస్తే ఉభయదేశాల బృందాల చర్చలలో ముందుకు వచ్చిన వాణిజ్య మండలి, 30 బిలియన్ డాలర్ల వంతున ఇరుదేశాలూ పన్నుల తగ్గింపు అమలుకు పూనుకోవాలని కూడా ట్రంప్షీ అంగీకరించారు.కృత్రిమ మేథ(ఏఐ) సంబంధిత ముప్పులాభాల గురించి అభిప్రాయ మార్పిడికి ఒక యంత్రాంగాన్ని నవంబరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.

రెండు పెద్ద దేశాల మధ్య సయోధ్య అది తాత్కాలికమా‘శాశ్వతమా అన్న అంశాన్ని పక్కన పెడితే ఎంతకాలం కొనసాగితే అంతకాలం అనేక దేశాలకు పరోక్షంగా ఎంతో ఉపయోగం. ఇరుదేశాల నేతల మధ్య వాషింగ్టన్‌లో జరిగిన చర్చలలో ఇరాన్అమెరికా చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జింపింగ్ ఆకాంక్షించారు. అయితే ఇరాన్ మీద వత్తిడి తేవాలని కోరిన ట్రంప్‌కు నిరాశే ఎదురైందని వారి భేటీ తరువాత వెలువడిన విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుత వివాదం మరింత విస్తరించకుండా ఉండాలని ఈజిప్టుతో సహా మధ్య ప్రాచ్యదేశాలే కాదు, ఐరోపా కూడా కోరుకుంటున్నది.అమెరికా గనుక తమ విషయంలో తెగేదాకా లాగితే హార్ముజ్ జలసంధితో పాటు ఎర్ర సముద్రంఅరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్‌ను కూడా స్థంభింప చేస్తామని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే గనుక జరిగితే మధ్యధరాఎర్ర సముద్రాలను కలిపే సూయజ్ కాలువ ద్వారా జరిగే నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది.తద్వారా ఎగుమతి దిగుమతులకు ఇబ్బందేగాక ఈజిప్టు ఆదాయానికి గండిపడుతుంది.“ పెత్తందారీ భాష సమస్యలను పరిష్కరించదు, ఏమీ చేయకుండా నిరంతర భద్రత నిలవదు” అని షీ స్పష్టంగా చెప్పాడు. అది ఇరాన్, మధ్య ప్రాచ్యం గురించే అన్నది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్. ఆఫ్రికా ఖండంలో చైనా, రష్యా పలుకుబడి పెరగకుండా అమెరికా తన మిలిటరీని పటిష్టపరుస్తున్నది. అందుకు ప్రతిగా బీజింగ్, మాస్కో పని చేస్తున్నాయి. షీ జింపింగ్ అమెరికా పర్యటన పర్యవసానాలు ఐరోపా మీద కూడా పడే అవకాశం ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కావటంలో ఐరోపా ఇస్తున్న ప్రాధాన్యత చైనాఅమెరికాలకు లేదు. మధ్యంతర ఎన్నికలకు ముందు వాణిజ్య వ్యవహారాల్లో చైనా మనస్సు కరగాలని అమెరికా కోరుకుంటున్నది.మరోవైపు ఐరోపాచైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రోజుకు ఒక బిలియన్ యÖరోల వాణిజ్య లోటు చైనాతో పెరుగుతున్నదని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ చెప్పిన అంశం తెలిసిందే.తమ వాణిజ్యలోటును తగ్గించుకొనేందుకు అమెరికాతో కలసి పని చేయాలని ఐరోపా కోరుకుంటున్నప్పటికీ అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నది. ఈ స్థితిలో తాము ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ దానికా శక్తి లేదని తేలిపోయింది. ఇరాన్‌పై నిరంతర దాడులతో అమెరికా వద్ద ఆయుధాలు నిండుకుంటున్నాయనే వార్తలు ఐరోపాకు ఆందోళన కలిగిస్తున్నాయి. తన అనుయాయులకు భద్రత కల్పిస్తామన్న అమెరికా మాటల మీద అనేక దేశాలకు అనుమానాలు కలుగుతున్నాయి.చైనా అమెరికా వాణిజ్య విషయంలో ఘర్షణ పడతాయని దాంతో చైనాలో ఉన్న అనేక పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు మన దేశానికి బారులు తీరుతాయని అనేక మంది కరోనా తరువాత కథనాలు ప్రచురించారు. అదేమీ జరగలేదు. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడిన అంశం చైనీయులకుఅమెరికన్లకు తెలుసు అందువలన సాధ్యమైనంత కాలం రాజీపడతారు తప్ప ఘర్షణకు దిగి నష్టపోయేందుకు సిద్దంకాదని మనదేశంలో భ్రమలు పెట్టుకున్నవారు గ్రహించాలి.


తైవాన్ సమస్యపై వాషింగ్టన్ నిరంతరం బీజింగ్‌ను ఒకవైపు రెచ్చగొడుతూనే మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నది. మే నెలలో ట్రంప్ చైనా పర్యటన తరువాత తైవాన్ తమకు తొమ్మిదిన్నరవేల మైళ్ల దూరంలో ఉంది అని వ్యాఖ్యానించాడు. అంతదూరం ప్రయాణించి మిలిటరీ జోక్యం చేసుకోవటం సాధ్యం కాదన్న భావం దానిలో ధ్వనించింది. ఇదే సమయంలో తైవాన్‌కు ఆయుధాల సరఫరా చైనాతో బేరసారాలకు తురుపుముక్క అని కూడా చెప్పాడు.ఇటీవలనే 14 బిలియన్ డాలర్ల ఆయుధాలను అందచేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది. అయితే షీ ఎన్నడూ తైవాన్ విషయంలో రాజీ వైఖరిని ప్రదర్శించలేదు. చైనాతో ఎలా వ్యవహరించాలన్న అంశంలో అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినపుడు బీజింగ్ తమకు వ్యూహాత్మక పోటీదారు అని ప్రకటించాడు.అదొక జనాలకు అంతుబట్టని బ్రహ్మ పదార్ధంగా ఉంది. ఇటీవలి వైఖరిని చూస్తే ఉభయ దేశాల సంబంధాలు జి 2( రెండు దేశాల బృందం)గా ఉండేందుకు సిద్దం అన్న సంకేతాలు ఉన్నాయి.దానికి అనుగుణంగానే షీ జింపింగ్ స్పందన ఉంది. “ పోటీలో ఉన్నామని చెప్పుకొనేందుకు మినహాయింపులు అవసరం లేదు, కానీ మన పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి, అది హద్దుల్లోనే ఉండాలి. ఒకరిని మరొకరు అందుకొనే పరుగుపోటీలా ఉండాలి తప్ప ఎవరో ఒకరు గెలవాలి లేదా ఓడిపోవాలన్న కుస్తీలా ఉండకూడదు.” అన్నాడు. వాషింగ్టన్ భేటీని చూసినపుడు చైనా పోటీదారు కాదు, సమానమైనది అని అంగీకరించేందుకు సిద్దం అన్నట్లుగా అమెరికా వైఖరి ఉందన్నది కొందరి విశ్లేషణ.


ప్రచ్చన్న యుద్ద సమయంలో అమెరికా`ఐరోపాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా సోవియట్‌కు వ్యతిరేకంగా పోరాడాలనే వైUరిని జనంలో కలిగించటంలో అమెరికా సఫలమైంది. కానీ చైనా విషయంలో అది సాధ్యం కావటం లేదు. గత నాలుగున్నర దశాబ్దాలుగా చైనా వస్తువులు ప్రవేశించని ఐరోపా మార్కెట్ లేదు, అమెరికా సరేసరి.చైనా తమ సైద్ధాంతిక శత్రువుగా ఆ దేశాల వారు చూడటం లేదు. గతంలో రష్యన్లను శత్రువులుగా, బుర్రలేని వారిగా చిత్రించిన హాలీవుడ్ సినిమాలు పుంఖాను పుంఖాలుగా వచ్చినట్లు ఇప్పుడు చైనీయుల మీద తీసే సాహసం చేయటం లేదు. అలా తీస్తే 140 కోట్ల చైనా మార్కెట్‌ను అవి కోల్పోయినట్లే. అమెరికా రాజకీయ నేతలు కూడా పోటీ గురించి మాట్లాడుతున్నారు తప్ప గతంలో సోవియట్‌ను వర్ణించినట్లు చైనా మన శత్రువని స్వంత జనానికి చెప్పటం లేదు. సోవియట్ ప్రభావాన్ని అదుపు చేయాలన్నట్లు చైనా విషయంలో ఏ నాయకుడు కూడా సిద్దాంతాలను ముందుకు తేలేదు. ఒక స్నేహితుడిగా ఉండటం ఒక గౌరవంగా పరిగణిస్తానని ట్రంప్ చెప్పాడు. అమెరికా ప్రారంభించిన వాణిజ్య పోరులో మొత్తం మీద విజేత చైనా, నష్టపోయింది అమెరికా. గతేడాది ఫిబ్రవరి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య అమెరికన్లు ఏ అంశం మీద స్పందిస్తున్నారో తెలుసుకొనేందుకు పూ పరిశోధనా సంస్థ చేసిన సర్వేలో పన్నెండు నెలల కాలంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు తట్టుకోలేకపోతున్నామని చెప్పిన వారు 67 నుంచి 73శాతానికి, ద్రవ్యోల్బణంపై 63 నుంచి 66కు, ఫెడరల్ బడ్జెట్‌లోటుపై 57 నుంచి 64, నిరుద్యోగంపై 25 నుంచి 36శాతానికి పెరిగారు. ఈ నేపధ్యంలో చైనా మీద జబ్బచరిచేందుకు, దెబ్బతీస్తానని, విజయం సాధిస్తామని చెప్పేందుకు ఏ నేత అయినా సాహసించగలడా ! పెట్టుబడిదారీ విధానాన్ని ఎలాగైనా నిలబెట్టాలని చూస్తున్నది అమెరికా పాలకవర్గం.సోషలిజాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నది చైనా కమÖ్యనిస్టు పార్టీ. రెండు విరుద్దశక్తులు ఘర్షణ పడాలి కదా ఎందుకు అలా జరగటం లేదన్నది కొందరి ప్రశ్న.పెట్టుబడిదారీ వర్గం వందల సంవత్సరాల అనుభవంతో మౌలిక స్వభావాన్ని అట్టేపెట్టుకొని అనేక ఎత్తుగడలను అనుసరిస్తున్నది. ఆ వర్గం స్థానంలో దోపిడీ లేని శ్రామికవర్గ వ్యవస్థ కోసం పోరాడుతున్న శక్తులు కూడా అదే విధంగా వ్యవహరించకూడదు ?

పన్నెండేళ్ల నరేంద్రమోడీ ఏలుబడి తీరు : మంచి నీళ్ల సీసాలు, ఐస్ క్రీమ్ తయారీలో భారత్ – భవిష్యత్ పరిశ్రమల నిర్మాణంలో చైనా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఈ మాటలు నావి కాదు, ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ఆర్‌పిజి గ్రూప్ అధ్యక్షుడు హర్ష గోయంకా సెప్టెంబరు 22న ఎక్స్‌లో చేసిన వ్యాU్య అంశాలు. రానున్న ఇరవై సంవత్సరాల పరిణామాలను నిర్దేశించే భవిష్యత్ పరిశ్రమలను చైనా ఏర్పాటు చేస్తుండగా భారత్ సీసాల్లో మంచినీళ్లు, ఐస్‌క్రీమ్‌లు, తినుబండారాల తయారీ వాటిని వెంటనే అందచేసే ప్రక్రియలో ఉన్నదని అన్నారు. ఎక్స్‌లో ఏముందంటే “ పరిశ్రమల్లో ఆధిపత్యాన్ని చైనా నిర్మిస్తోంది.అది రానున్న ఇరవై సంవత్సరాలను నిర్దేశిస్తుంది.విలువైన ఖనిజాలు,అయస్కాంతాలు, బ్యాటరీలు, విద్యుత్ వాహనాలు, రోబోటిక్స్, సెమికండక్టర్లు, ఆధునిక ఉత్పాదకతలు ఉన్నాయి. జెఎల్ మాగ్ ఒక చక్కటి ఉదాహరణ. అది ఇప్పటికే అధిక సామర్ధ్యంతో పనిచేసే విలువైన ఖనిజాలతో అయస్కాంతాల తయారీలో ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు మానవ రూపంలో ఉండే రోబోల తయారీకి అవసరమైన విడి భాగాలను తయారు చేసేందుకు ముందుకు పోతున్నది. వ్యూహరచన సాధారణమే స్వంతంగా ముడిసరకులు,, సాంకేతిక పరిజ్ఞానం,ఉత్పత్తి మరియు మొత్తంగా అవసరమైన పని పరిస్థితిని కల్పించటం. ఇదిలా ఉండగా ఎక్కువ మంది భారతీయ వాణిజ్యవేత్తలు సుకుమారమైన అవకాశాల కోసం ఇప్పటికీ చూస్తున్నారు సీసాల్లో మంచినీరు, ఐస్ క్రీమ్‌లు, తినుబండారాలు, పాకేజ్‌డ్ ఫుడ్ మరియు వాటిని వెంటనే అందచేయటం.చివరికి మన గొప్ప సాఫ్ట్‌వేర్ విజయం కూడా ఎక్కువగా శ్రమశక్తిని ఖర్చు తగ్గించే బేరం చేసేదిగా ఉంది. చైనా రేపటి మౌలికసదుపాయాలను నిర్మిస్తోంది. రేపు ప్రపంచానికి అవసరమైన వాటిని మనం నిర్మిస్తున్నామా అని భారత్‌లో ఉన్న మనం మనల్ని ప్రశ్నించుకోవాలి ” గత ఏడాది 2025 ఏప్రిల్ మొదటి వారంలో స్టార్టప్ మహాకుంభ జరిగింది. ఆ సమావేశంలో సందేశమిచ్చిన వాణిజ్యశాఖ మంత్రి పియÖష్ గోయల్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన అంశం.చైనా సెమీ కండక్టర్లు, రోబోలు, విద్యుత్ వాహనాల తయారీలో ముందుకు పోతుంటే మన దేశంలో స్టార్టప్స్(అంకుర కంపెనీలు) ఐస్‌క్రీమ్‌లు, ఆహార సరఫరా, వేగవంతమైన వాణిజ్య కార్యకలాపాలపై కేంద్రీకరించాయన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహనదాస్ పాయి మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ మనదేశంలో కూడా ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన సంస్థలున్నాయని, అయితే అంకుర సంస్థలకు పెట్టుబడులు ఎక్కడ అని ప్రశ్నించారు.మన దేశంలో 2014`24 మధ్య ఈ సంస్థలు కేవలం 160 బిలియన్ డాలర్లు మాత్రమే పొందితే చైనాలో 845 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు.నియంత్రణ ఆటంకాలు ఉన్నాయన్నారు.

అంటే అన్నారని బిజెపి పెద్దలు రుసరుసలాడుతారు, అంతా గాంధీ,నెహ్రూయే చేశారని వారికి నేర్పిన చిలకపలుకులను వల్లిస్తారు. కాంగ్రెస్ యాభై సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేశానని 2019 ఎన్నికల్లో కోతలు కోశారు. పన్నెండేండ్ల ఏలుబడి తరువాత హర్ష గోయంకా ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు బిజెపి నేతలు సిగ్గుతో తలదించుకోవాలి కదా ! తన మాటలు విధాన నిర్ణేతలకు సూటిగా తగులుతాయని తెలిసి కూడా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా మాట్లాడటానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నరేంద్రమోడీ ఏలుబడి బలహీనతలు దీనికి దోహదం చేస్తున్నాయని వేరే చెప్పాలా ? ఇది ఆరంభం మాత్రమే. హర్ష గోయంకా చెప్పిన మాటలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 1990 దశకం నుంచి ప్రభుత్వ రంగం పెట్టుబడులను నిలిపివేసింది.ఆ సంస్కరణలను మరింత ముందుకు తీసుకుపోతానని 2014 ఎన్నికల్లో మోడీ ప్రచారం చేయలేదా ? ఫలితం, పర్యవసానాలు ఇవే కదా ! దేశ భవిష్యత్ మొత్తాన్ని ప్రైవేటు రంగానికి వదలి పెడితే పెద్దగా కష్టపడకుండా లాభం ఇచ్చే ్త వాటి మీదే కేంద్రీకరిస్తుంది.

మనదేశంతో ఉన్న అవసరాల రీత్యా కొన్ని సంస్థలు, వ్యక్తులు మనల్ని ఆకాశానికి ఎత్తి నేతల్ని మునగచెట్టు ఎక్కించవచ్చు.కానీ వాస్తవాలను మÖసిపెట్టలేరు. దిగుమతి చేసుకొనే వస్తువుల వినియోగం పెరిగిందంటే దాని అర్ధం మోడీ ఏలుబడిలో కొనుగోలు శక్తి పెరిగినట్లే కదా అని బిజెపి పెద్దలు అంటారు.వారి భుజాలను వారే చరుచుకుంటారు. నిజానికి మనదేశంలో 145 కోట్ల మంది వినియోగదారులున్నారని చెప్పటం పెద్ద వక్రీకరణ. వారంతా వస్తు వినియోగం చేస్తే పన్నెండేండ్లలో పారిశ్రామిక ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి ఎందుకు ఉంది.పదేండ్ల యుపియే పాలనా కాలంలో జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 15.3 నుంచి 17.3శాతం మధ్య ఉంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులతో 25శాతానికి పెంచుతామని చెప్పినప్పటికీ గత పన్నెండు సంవత్సరాల్లో 15.6శాతానికి తగ్గింది తప్ప పెరగలేదు. చైనా మాదిరి ఎగుమతులు చేస్తున్నామా అంటే అదీ లేదు.పెద్ద మార్కెట్ లేదా ఎగుమతులు చేస్తే దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉండేది. ప్రధానిగా అధికారానికి వచ్చిన తొలిరోజుల్లో నరేంద్రమోడీ నిత్యం విదేశీ ప్రయాణాలు చేస్తున్నారనే విమర్శ వచ్చింది. అవును నిజమే పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో దిగజారిన దేశ ప్రతిష్టను తిరిగి పైకి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడుల కోసం తిరిగారని బిజెపి పెద్దలు సమర్ధించారు. ఎంత వరకు నిజం ! ఏటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) బిలియన్ డాలర్లలో ఎలా వచ్చాయో చూడవచ్చు. ఈ వివరాలు మన రిజర్వుబ్యాంక్, ప్రపంచ బ్యాంకు వెల్లడించినవే.

సంవత్సరంIIఎఫ్‌డిఐ

2014 II 31.36

2015 II 36.00

2016 II 44.49

2017 II 39.90

2018 II 42.23

2019 II 50.61

2020 II 64.00

2021 II 44.73

2022 II 49.94

2023 II 28.09

2024 II 27.14

2025 II 39.10

పన్నెండు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 470.45 బిలియన్లంటే సగటున ఏటా 39.20 బిలియన్ డాలర్లు మాత్రమే. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భరత, పిఎలఐ స్కీములను ఎన్ని ప్రవేశపెట్టినప్పటికీ పరిస్థితి ఇది. ఇదే కాలంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడి మొత్తం 250 బిలియన్ డాలర్లన్నది పెద్దగా ప్రచారంలో లేని అంశం. చైనాకు వచ్చిన పెట్టుబడి 2,195.17 బిలియన్ డాలర్లు. అయితే 2014లో 268 బిలియన్ డాలర్లు కాగా, 2025లో 79.98 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. చైనా నుంచి కూడా పెట్టుబడులు గత పన్నెండు సంవత్సరాల్లో సగటున ఏటా వంద బిలియన్ డాలర్ల వంతున బయటకు వెళుతున్నాయి. ఇక మన దేశభక్తులైన కార్పొరేట్ల సంగతి చూద్దాం.వారికి ఇస్తున్న రాయితీలు తప్ప వారి పెట్టుబడులు పెరగటం లేదు. ఈ పన్నెండు సంవత్సరాలలో ప్రైవేటు పెట్టుబడి జిడిపిలో 1112శాతం మధ్య నిలకడగా ఉంది. ఇటీవలి కాలంలో వస్తున్న పెట్టుబడులలో అధికభాగం ఉపాధి రహిత వృద్ధి, కార్పొరేట్లకు లబ్దిచేకూర్చేవే కావటం విశేషం. అందుకే అసలు ఉపాధి దొరకని వారితో పాటు అరకొరవేతనాలతో పని చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నది. యుపిఏ పాలనా కాలంలో పదేండ్ల జిడిపి వృద్ధి రేటు 7.5 నుంచి 7.8శాతం , మోడీ ఏలుబడిలో 67శాతం మధ్య ఉన్నది.మరోవైపున 201724 మధ్య ఏటా గ్రామీణ వ్యవసాయేతర కార్మికుల వేతనాలు ఇదే కాలంలో పెరిగింది 5.4, రోజువారీ కూలీలకు 5.69,వేతన జీవులకు 3.54.ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెరిగింది అత్యధికులకు సున్నా లేదా అతి తక్కువగా ఉంది.వ్యవసాయ కార్మికులదీ ఇదే పరిస్థితి. దీని అర్ధం ఏమిటీ జిడిపి పెరిగినంత మాత్రాన కష్టజీవులకు దక్కుతున్నదేమీ లేదు. అవసరాలకు అనుగుణంగా రాబడి పెరగని కారణంగా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. మోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో రుణ భారం 26 శాతం ఉండగా 2026లో 45.5శాతానికి పెరిగింది.సగటున 2025లో రు.4.8లక్షలు ఉంది. వేతనాలు, ఉపాధి పెరగనపుడు జిడిపిలో ఎంత వృద్ధి రేటు ఉంటే ఉపయోగం ఏమిటి ?


ఈ ఏడాది తొలి మÖడు మాసాల్లో జిడిపి గురించి మోడీ గొప్పలు చెబుతున్నారు.గత ఆరునెలలుగా మనదేశంలో చక్రీయ వృద్ధి చోటు చేసుకుందని జెపి మోర్గాన్ సంస్థ భారత ప్రధాన ఆర్థికవేత్త సాజిద్ చినాయ్ చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రత్యక్ష పన్నులు , సెప్టెంబరులో వినిమయ పన్నుల తగ్గింపు, వడ్డీ రేట్లు ఒకటిన్నర శాతం తగ్గటం వంటి అంశాలు దీనికి దోహదం చేశాయన్నారు.అయితే మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న ఘటనలతో జరిగినదాన్ని ఇది పూడ్చుతుందా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.హార్ముజ్ జలసంధి ద్వారా నిలిచిపోయిన ఇంథన సరఫరాను ఇతర వనరుల ద్వారా పూడ్చుకోవటం ద్వారా వృద్ధి రేటును రక్షించుకుంటున్నదన్నారు. పన్నుల అనిశ్చితి, ప్రపంచ గిరాకీ, రూపాయి బలహీనపడటంతో మన వస్తువులు ప్రపంచంలో చౌక ధరలతో పోటీపడటం వంటి కారణాలతో ఎగుమతులు 12శాతం పెరిగాయని కూడా కొందరు చెబుతున్నారు. రూపాయి విలువ గణనీయంగా పడిపోవటంతో ఐటి కంపెనీలకు పంటపండుతున్నది. కొద్ది నెలలుగా ఉపాధి పెద్దగా ఉండని, లాభాలు వచ్చే డేటా కేంద్రాలు, పునరుత్పాదక ఇంథనం, లోహాల వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. విశాఖ గూగుల్ డేటా సెంటర్ గురించి తెలుగుదేశం నేతలు లక్షల ఉద్యోగాలంటూ ఎంత హడావుడి చేశారో చూశాము. అది ఉనికిలోకి వచ్చిన తరువాత అసలు రంగు బయటపడుతుంది.


రైల్వేల్లో 8,868 ఉద్యోగాలకు 2025 నవంబరులో నోటిఫికేషన్ ఇవ్వగా కోటీ ఇరవైలక్షలకు పైగా దరఖాస్తు చేశారు, ఒక్కో ఉద్యోగానికి సగటున 1,370 మంది పోటీ పడ్డారు. కొన్నింటికి రెండువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయట. అదే ఏడాది అంతకు ముందు జైపూర్‌లో ఒక్కో ఫ్యూన్ ఉద్యోగానికి పిహెచ్‌డీలతో సహా విద్యావంతులు 47 మంది పోటీపడ్డారు. సంబల్‌పూర్‌లో 187ీVAమ్ గార్డు పోస్టులకు ఎనిమిదివేల మంది దరఖాస్తు చేశారు. తాజా కార్మికశక్తి సర్వే ప్రకారం 60కోట్ల మంది పని చేసే వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగులు 56శాతం ఉన్నారు, అంటే మÖడు నుంచి మÖడున్నర కోట్ల మంది నిరుద్యోగులున్నారు. నామమాత్ర పని దొరుకుతున్నవారిని కూడా నిరుద్యోగులుగా పరిగణిస్తే అలాంటి వారు ఇరవై కోట్లని అంచనా. పన్నెండు కోట్ల మంది కాజువల్ లేబర్ ఉన్నట్లు అంచనా, వీరికి రోజూ పని దొరుకుతుందనే హామీ లేదు. మన ప్రభుత్వం సేకరిస్తున్న గణాంకాలను చూస్తే 60శాతం మంది స్వయం ఉపాధి, నెలవారీ లేదా రోజూ వేతనం పొందేవారు 20, కాజువల్ లేబర్ 20శాతం ఉన్నారని తేలుతున్నది తప్ప, రోజుకు నాలుగైదు గంటలు పని చేసే పాక్షిక ఉపాధి పొందుతున్నవారెంత మంది అన్నది సేకరించటం లేదు.పకోడీల బండి పెట్టుకున్నప్పటికీ ఉపాధి కల్పించినట్లే కదా అని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడైనా ఈ సమస్య గురించి చర్చించిందా ! అమెరికా, ఐరోపా దేశాల్లో ఉపాధి గురించి కచ్చితమైన లెక్కలు తీస్తున్నారు, ఎందుకంటే అక్కడ నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇటలీలో 2024 వివరాల ప్రకారం నిరుద్యోగులు ఏడు శాతం, పాక్షికంగా పని చేసేవారు 20శాతం ఉన్నట్లు తేలింది. అదే టర్కీలో 25శాతం, మనదేశంలో పూర్తిగా పనిలేని వారు 90శాతం ఉన్నట్లు అంచనా.

ఆర్థికవేత్త జీన్ డ్రెజ్, అతని సహచరులు మన గ్రామీణ నిజవేతనాల పెరుగుదల 201516 నుంచి 0.1, పట్టణాల్లో 0.8 అని చెప్పారు. నెలవారీ వేతన కార్మికుల నిజవేతనాలు 201718 నుంచి గణనీయంగా పడిపోయినట్లు, కాజువల్ కార్మికుల వేతనాలు కాస్త పెరిగినప్పటికీ 202122 తరువాత గిడసబారినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరాలన్నీ జిడిపి వృద్ది రేటు ఎక్కువగా ఉన్నవే అయినప్పటికీ నిజవేతనాలు దానికి అనుగుణంగా పెరగలేదు. పన్నుల అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఎగుమతులు పెరిగాయి చూడండి అని మొత్తాల అంకెలను చూపుతారు. జిడిపిలో ఎగుమతుల`దిగుమతుల శాతాలు ఎలా ఉన్నాయో చెబితే అసలు రంగు బయటపడుతుంది. మోడీ అధికారానికి వచ్చినపుడు డాలరుకు రూపాయి విలువ 60కంటే తక్కువ ,ఇప్పుడు 95 దాటింది.పది వస్తు, సేవల ఎగుమతుల ద్వారా 2014లో వంద డాలర్ల ఆదాయం వచ్చిందంటే ఆరువేలు, అదే పదింటికి 2026లో అంతే మొత్తం ఎగుమతి చేస్తే 9,500 వస్తాయి. చూశారా మేము ఎలా పెంచామో అంటారు. అనేక మంది మోడీ దేశాన్ని రక్షించాడని బిజెపి ఐటి సెల్, దాన్ని అనుసరించేవారు భజన చేస్తారు, అదే నిజమైతే యుపిఏ కంటే వృద్ధి రేటు ఎందుకు తగ్గినట్లు ?

కొత్త ఆయుధం ఉందన్న ఇరాన్ – హౌతీలతో అమెరికా రాజీ ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

సౌదీ అరేబియాకు మద్దతుగా ఎమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లకు పట్టున్న ప్రాంతాలపై దాడులకు ఆదేశించిన ట్రంప్, మిలిటరీ అన్ని రకాల ఆయుధాలను సిద్దం చేసిన తరువాత చివరి క్షణంలో ఆపండని చెప్పాడు. మరోవైపున ఓమన్ మధ్యవర్తిత్వంలో హౌతీలతో అమెరికా ఒక అవగాహనకు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.దీన్ని బట్టి పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికాలో తలెత్తిన గందరగోళం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మొత్తాన్ని లేపివేస్తానని ట్రంప్ మరోసారి కోతలు కోశాడు. అదే జరిగితే ఊహించని కొత్త ఆయుధాలతో పశ్చిమాసియాలోని అమెరికా, ఇతర కొత్త లక్ష్యాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బుధవారం నుంచి ఇరాన్ ఎయిర్‌లైన్స్ కార్యకలపాలను ప్రపంచ వ్యాపితంగా స్థంభింప చేస్తామని ట్రంప్ బెదరించాడు. తాము సౌదీ నౌకలు, ఇతర లక్ష్యాలపై తప్ప అమెరికా ఇతర దేశాల వాటి జోలికి వెళ్లటం లేదని హౌతీలు ప్రకటించారు. ఇది వ్యూహాత్మక నిర్ణయం అన్నది స్పష్టం. వారిపై దాడుల ఆలోచన విరమించటంతో ఎర్ర సముద్ర ప్రాంతం, ఎమెన్‌లోని అనేక కీలక ప్రాంతాలను వారు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.తమ తరఫున మిలిటరీ చర్యలకు పాల్పడాలని కొద్ది రోజుల క్రితం సౌదీ చేసిన వినతిని వాషింగ్టన్ తిరస్కరించింది.అయితే సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబిఎస్) గురువారం నాడు మరోసారి చేసిన వినతి మేరకు శుక్రవారం నాడు ట్రంప్ సమ్మతించి దాడులకు సిద్దం కావాలని ఆదేశించాడు. విమానాల్లోకి బాంబులు, ఇతర మారణాయుధాలను సిద్దం చేసి ఎగరటానికి సిద్దం అవుతున్న సమయంలో ఆదివారం నాడు ఆపివేశాడు. గత బుధవారం నాడు తన సలహాదారులతో మాట్లాడుతూ హౌతీసౌదీ పోరులో దూరటం తనకు ఇష్టం లేదని చెప్పిన పెద్ద మనిషి తరువాత అంగీకరించి, వెనక్కు తగ్గిన మధ్యలో ఏం జరిగిందన్నది ఆసక్తికరం. తమకు పట్టున్న ప్రాంతాల నుంచి అమెరికా, ఇతర దేశాల నౌకల మీద ఎలాంటి దాడులు చేసేది లేదని, ఒక్క సౌదీ అరేబియా మీదనే తమ గురి అని హౌతీలు చెప్పారు. ఈనెల పన్నెండున ఐర్లండ్ పర్యటనలో వారు తమ మీద దాడులు చేసేది లేదని చెప్పినట్లు ట్రంప్ స్వయంగా చెప్పాడు.అయినప్పటికీ సౌదీ నుంచి వచ్చిన వత్తిడి కారణంగా ఊగిసలాటను ప్రదర్శించాడు. సౌదీకి సాయాన్ని నిరాకరిస్తే రానున్న రోజుల్లో ఆ విషయాన్ని అది గమనంలో ఉంచుకొని వ్యవవహరిస్తుందని అమెరికా మాజీ అధికారి ఒకరు ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరించాడు.


గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్ర ప్రాంతంలోని ముఖ్యమైన దీవులను, ఒక రేవును హౌతీలు స్వాధీనం చేసుకొని తమ సత్తా చాటారు. దాడుల నిలిపివేత గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇచ్చిన వార్త తప్ప అధికారికంగా ధృవీకరించలేదు. అదే సమయంలో దాడులకు కూడా పూనుకోలేదు.సౌదీతో తమకు రక్షణ ఒప్పందం ఉందని, తమ ఆనుయాయులను ఎల్లవేళలా కాపాడతామని అధికారులు చెప్పటాన్ని బట్టి తిరిగి దాడులకు ఆదేశించినా ఆశ్చర్యం లేదు. ట్రంప్ అంతరంగికులలో ఎక్కువ మంది దాడుల పట్ల ఆసక్తితో లేరని మరో అధికారి చెప్పినట్లు కూడా వార్త వచ్చింది.ఇరాన్‌తో ఏదో ఒకటి తేల్చుకోవాలనే వైఖరితో ట్రంప్ ఉన్నట్లు తనతో చెప్పాడని ఫాక్స్ న్యూస్ ట్రే ఇంగెస్ట్ అనే విశ్లేషకుడు వెల్లడించాడు. పెద్ద పరిణామాలు జరిగే అవకాశం ఎంతో దూరంలో లేదని ట్రంప్ తనతో చెప్పాడని, తమ దేశాన్ని పేల్చివేయకుండా ఉండాలంటే దానికి అనుగుణంగా ఉండాలో లేదో ఇరానియన్లు తేల్చుకోవాలని ఇంగెస్ట్ అన్నాడు. ఇలాంటి వదరుబోతు మాటలను గత ఏడు నెలల్లో ఎన్నోసార్లు చూశాం. ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు గానీ ఇప్పుడు దాడులకు దిగితే బాబ్ ఎల్ మండాబ్ జలసంధిని హౌతీలు దిగ్బంధిస్తే అమెరికా పార్లమెంట్ ఎన్నికల్లో అది మరింతగా ట్రంప్ ప్రతిష్ట దిగజార్చుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే విమాన ఇంథన కొరతతో ఐరోపా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎర్ర సముద్ర మార్గం మÖసుకుపోతే సమస్య మరింతగా ముదురుతుంది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కీలక ప్రాంతాలపై హౌతీలు జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. జూలై నుంచి ప్రారంభమైన దాడులతో తొలిసారిగా శుక్రవారం రాత్రి రియాద్‌లో హెచ్చరికలు జారీ చేశారు.మరుసటి రోజు దాడులు జరిగాయి. సౌదీ చమురు కంపెనీ ఆరామ్‌కో మంటలతో పాటు నగరంలో అనేక చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి.హౌతీల దాడుల తరువాత సౌదీ నుంచి చమురు ఎగుమతులు పడిపోవటంతో బ్రెంట్ రకం ముడి చమురు ధరలు సెప్టెంబరు 15న 109 డాలర్ల వరకు పెరిగాయి, తరువాత ఎగుమతులు పెరగటంతో సోమవారం నాడు 99 డాలర్లకు తగ్గి బుధవారం నాడు వంద డాలర్లకు 98 డాలర్లకు పడిపోయింది. ఒక వైపు బెదిరిస్తూనే ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చాడు. అయితే తాము వెనక్కు తగ్గేది లేదని టెహరాన్ తన షరతులను పునరుద్ఘాటించింది.


రియాద్‌పై దాడి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించటమే అని ఈజిప్టు, జోర్డాన్, కువాయిట్ వ్యాఖ్యానించాయి. ఎమెన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా హౌతీలపై సౌదీ పది సంవత్సరాల పాటు దాడులు చేయటాన్ని గతంలో ఈదేశాలేవీ గతంలో ఖండించలేదు. అన్ని మతవిలువలకు తిలోదకాలిచ్చి సౌదీపై దాడులు చేయటాన్ని ఖండిస్తున్నట్లు ప్రపంచ ముస్లిం లీగ్ ప్రకటించింది.సౌదీ అరేబియా తరఫున ఒకవేళ తుర్కియే, పాకిస్తాన్ తమపై దాడులకు దిగితే ఉక్కు పిడికిలితో సమాధానమిస్తామని హౌతీలు హెచ్చరించారు.తమపై ఎవరైనా దాడులకు దిగితే ఉమ్మడిగా ఎదుర్కోవాలని సౌదీ, తుర్కియే, పాక్ ఆగస్టు ఏడున మక్కా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.తమకు మద్దతు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను కూడా కోరింది.సాంకేతిక సాయంతో పాటు వీలైతే మిలిటరీ మద్దతు కూడా ఇస్తామని తుర్కియే ప్రకటించింది. అంతకు ముందు మిలిటరీ మద్దతు ఇచ్చేందుకు పాకిస్తాన్ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.తరువాత వైఖరిని మార్చుకున్నది. మక్కా, మదీనాల రక్షణ మతపరమైన తమ పవిత్ర బాధ్యత అని పాకిస్తాన్ ప్రకటించింది. సౌదీ, పవిత్ర స్థలాల రక్షణకోసం ఎంతకైనా సిద్దపడతామని ఇంటర్ సర్వీసెస్ ప్రజా సంబంధాల డైరెక్టర్ జనరల్ అహమ్మద్ షరీఫ్ చౌదరి ప్రకటించాడు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మిలిటరీ జోక్యం చేసుకుంటే పాక్ పరిస్థితి మరింతగా దిగజారుతుందని,భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎదురవుతాయని విమర్శకులు పేర్కొన్నారు.
తమకు వ్యతిరేకంగా మరోసారి ఏదైనా తప్పు చేస్తే అమెరికా, మధ్య ప్రాచ్య ప్రాంతాలపై బాధాకరమైన దాడులకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. నూతన ఆయుధాలతో గతంలో లక్ష్యంగా చేసుకొన్నవాటిని గాక కొత్త వాటిపై దాడి చేస్తామని సోమవారం నాడు ఇరాన్ ప్రకటించింది. ఈ పూర్వరంగంలో ఆ ప్రాంతదేశాల్లో పదకొండు అమెరికా రాయబార కార్యాలయాలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చని తమ పౌరులు, సిబ్బందికి హెచ్చరికలు జారీచేశాయి. అమెరికా మరోసారి దాడులకు తెగబడవచ్చని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నది.


గాజాలో మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిన అంతర్జాతీయ నేర న్యాయస్థానంపై తీవ్ర ఆంక్షలు విధించాలని ట్రంప్‌సిద్దపడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. డాలర్ల లావాదేవీలను నిషేధించి కోర్టు కార్యకలాపాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనికుల దాడులపై కూడా దర్యాప్తు జరపాలని ఆ న్యాయస్థానం నిర్ణయించినప్పటి నుంచి అమెరికా ఆగ్రహంతో ఉంది.ఐసిసిలో పని చేసే అనేక మంది న్యాయమÖర్తులు, ప్రాసిక్యూటర్ల మీద ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది.అయితే తాజా ఆంక్షల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికన్ పౌరులు, కంపెనీలు సేవలు, వస్తువులు, నిధులు ఇవ్వకూడదు.దర్యాప్తు అధికారులను నియమించకూడదు, అమెరికన్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించకూడదు.తమ మాదిరిగానే ఇతర దేశాలు కూడా ఈ కోర్టు నుంచి వెలుపలికి రావాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో పైరవీ చేస్తున్నాడు. ఇంతటి ఉద్రిక్తత ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషికియాన్ ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గ్గొనేందుకు న్యూయార్క్ వెళుతున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. సెప్టెంబరు మÖడవ తేదీ నాటికి ఇరాన్‌పై జరిపిన దాడుల ఖర్చు 4,306 కోట్ల డాలర్లకు చేరినట్లు తమ ఎంపీలకు అమెరికా వెల్లడించింది.ఆగస్టు నాటికి 3,800 కోట్ల డాలర్లని, ఉద్రిక్తత తీవ్రతను బట్టి నెలకు అదనంగా 300 కోట్ల డాలర్ల వరకు అదనంగా పెరుగుతుందని పార్లమెంటు బడ్జెట్ కార్యాలయం వెల్లడించింది. నిజానికి ఇంతకంటే ఎక్కువగానే ఖర్చు అయినట్లు అనధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి, ఎన్నికల ముందు అంగీకరించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్దంగా లేదు. మరోసారి దాడులకు తెగబడితే మరింత నష్టం లేకపోతే ఓటర్లలో పరువుకు భంగం అన్న భయంతో ట్రంప్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది. మొత్తం మీద చూస్తే పరిస్థితి అనిశ్చితి, అగమ్యగోచరంగా ఉంది !

   ఇరాన్ ఎట్టి పరిస్థితిలోనూ అణ్వాయుధాన్ని సమకూర్చుకోకుండా చూస్తామని, చర్చలకు తలుపు తెరిచే ఉన్నాయని ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.దశాబ్దాల క్రితమే ఎన్‌పిటిపై ఇరాన్ సంతకం చేసింది. దాని ప్రకారం అణ్వాయుధాలను తయారు చేయకూడదు. తాము ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నామని, అయితే ఒప్పందం నుంచి వైదొలగాలనే ఆలోచన చేస్తున్నామని, అది అమెరికా మీద ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉన్నత భద్రతా అధికారి మొహసెన్ రెజాయ్ స్పష్టం చేశాడు.అమెరికా దాడులు, ఆంక్షల కారణంగా ఎన్‌పిటి నుంచి వైదొలగాలని కోరుతూ కొంత మంది ఇరాన్ పార్లమెంటు సభ్యులు ఒక బిల్లును ప్రతిపాదించారు. దానికి స్పీకర్ అనుమతి ఇస్తే సభలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అమెరికా గనుక దాడులు కొనసాగిస్తే పదిహేను సంవత్సరాల యువకులకు సైతం మిలిటరీ అవగాహన కలిగించాలని ఇరాన్ నిర్ణయించింది.పద్దెనిమిదేండ్లు దాటిన వారందరికీ మిలిటరీ శిక్షణ ఇస్తున్నారు. భాషా కేంద్రం ముసుగులో ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను టెహరాన్‌లోని ఫ్రెంచి భాషా కేంద్రాన్ని ఇరాన్ ప్రభుత్వం మÖసివేసింది.దీనికి వ్యతిరేకంగా ఇరాన్ రాయబారిని పిలిపించి తగుచర్యలు తీసుకుంటామని ఫ్రాన్సు ప్రభుత్వం ప్రకటించింది. తమ సంస్కృతి మీద దాడిగా ఈ చర్యను పరిగణిస్తామని పేర్కొన్నది.ఫ్రెంచి బోధన ముసుగులో ఇరాన్‌కు వ్యతిరేకంగా జనాలను కూడగడుతూ దేశభద్రతకు ముప్పు తెస్తున్నదని, ఇరానియన్లను దేశం వెలుపలకు దాటించేందుకు ఏర్పాటు చేస్తున్నందున అనేక సార్లు హెచ్చరించినా పట్టించుకొని కారణంగా రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆ కేంద్రాన్ని మÖసివేసినట్లు ఇరాన్ తెలిపింది. 

పాతికేండ్ల మోడీ పాలన అనుభవం : చంద్రబాబు మరీ అంతగా భజన చేయాలా ! జనజీవితాలను మెరుగుపరచని జిడిపి పెరిగితేనేం తగ్గితే ఏమిటి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీకి 76 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పదవిలో పాతిక సంవత్సరాలు గడిపారు. పార్టీలో అడ్డుతొలిగించుకొనే ఇతర నేతలకు 75 సంవత్సరాలు నిండాయనే సాకుతో మార్గదర్శక్ మండల్ పేరుతో పాలసామాన్ల కొట్లో పడేసినట్లు చేశారు.తనకు మాత్రం అదేమీ వర్తించనట్లు ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు బిజెపి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17వరకు సేవాసంకల్ప అభియాన్ పేరుతో అనేక కార్యక్రమాలు జరపాలని బిజెపి పిలుపునిచ్చింది. అది ఊహించిందే, కానీ మరొక ఉదంతం జరిగింది.నరేంద్రమోడీ ఢిల్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసి వెళ్లి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో అంతదూరం వెళ్లారు, ఏదో ఒకటి చెప్పుకోవాలి గనుక పూజలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్నారు.చిత్రం ఏమిటంటే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు తప్పదు, ఇతర ఏ బిజెపి ముఖ్యమంత్రి కూడా అటు ఢిల్లీ ఇటు వారణాసి వెళ్లలేదు, ఎవరికి వారు తమ రాష్ట్రాల్లో పాల్గొన్నారు. కానీ రాజును మించిన రాజభక్తుడిలా చంద్రబాబు మాత్రం వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా పాతికేండ్లు పదవిలో ఉండి మోడీ ఏమి సాధించారన్నది పెద్ద ప్రశ్న. తన స్వంత రాష్ట్రం గుజరాత్ రక్తహీనతకు ప్రస్తుతం రాజధానిగా ఉంది.మహిళలు, పిల్లల్లో ఆ సమస్య ఉంటే ఎంత నష్టమో తెలిసిందే, పౌష్టికాహారం అందించటం ద్వారా మాత్రమే రక్తహీనతను పొగొట్టవచ్చు.పాతికేండ్లలో మోడీ ఆపని చేయలేకపోయారు. దేశాన్ని ఏమి ఉద్దరిస్తారు, ఇక తన ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూడండి అంటూ వర్తమాన సంవత్సర తొలి మÖడు మాసాల జిడిపి అంకెల గురించి కొద్ది రోజుల క్రితం తన భుజాలను తానే చరుచుకున్నారు.జిడిపి గురించి గతంలో ఏ ప్రధానీ చేయనంత హడావుడి మోడీ చేశారు. తాను అధికారానికి వచ్చే నాటికి ప్రపంచంలో పదవ స్థానంలో(నామినల్) ఉన్నదానిని కష్టపడి ఐదవ స్థానానికి చేర్చానని చెప్పారు.పన్నెండు సంవత్సరాల తరువాత ఏ మÖడో, నాలుగో స్థానానికో చేరాల్సింది కాస్తా 2026లో ఆరవ స్థానానికి ఎందుకు దిగజారిందో ఎప్పుడైనా చెప్పారా ?నిజానికి పిపిపి పద్దతిలో అప్పుడూ ఇప్పుడూ మÖడవ స్థానంలో ఉంది. రూపాయి విలువ పతనం వంటి కారణాలతో మనం ఆరవ స్థానానికి పడిపోయాం. కానీ బిజెపి పెద్దలు మన రూపాయి విలువ పతనం కాలేదని పిట్టకతలు చెబుతూనే ఉంటారు.


కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏప్రిల్జూన్ తొలి త్రైమాసిక జిడిపి వృద్ది రేటు 7.8శాతం అంకెలు వివాదాస్పదమయ్యాయి. అది అంకెల గారడీ అంటూ చర్చ జరుగుతున్నది.“వినాశకశక్తులు నాశనమయ్యాయి భారత్ వికసించింది” ఇదీ మన ప్రధాని నరేంద్రమోడీ వృద్ధి రేటు గురించి ఎక్స్‌లో చేసిన వ్యాఖ్య.ప్రాసకోసం తప్ప ఏమైనా అర్ధం ఉందా నాశనమైన ఆశక్తులేవో, దేశం ఎలా వికసించిందో చెప్పి ఉంటే ఆ మాటలకు విశ్వసనీయత ఉండేది. జెన్ జీ ఆందోళనతో దిమ్మదిరిగిన స్థితిలో ఈ అంకెలను చూపి జనం దృష్టిని మళ్లించాలని చూసినట్లు కొందరు చెప్పారు. దేశం వెలిగిపోతోంది అని చెప్పటం బిజెపి నేతలకు కొత్తేమీ కాదు, 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి నాయకత్వంలో అలాంటి ప్రచారంతోనే జనాలను మభ్యపెట్టాలని చూసి బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. బిజెపిలో ఉన్నంతలో నిజాయితీ పరుడని పేరున్న వాజ్‌పాయి పరువు పోయింది. మోడీ ఏలుబడిలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన సుభాష్ చంద్ర గార్గ్ ప్రభుత్వం ప్రకటించిన వృద్ధి రేటు 7.8శాతం నిజం కాదని 2.6 శాతానికి మించి లేదని వ్యాఖ్యానించటంతో వివాదం చెలరేగింది. అమెరికా, చైనా, జపాన్ వంటి మనకంటే ముందున్న దేశాల మీదనే ప్రతికూల ప్రభావాలతో జిడిపి తగ్గినపుడు మనం ఎలా పెరిగామన్నది అనుమానం. ఇటీవలి వరకు 201112 సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకొని గణాంకాలను తయారు చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన జిడిపి అంకెలను 202223 సంవత్సర ప్రాతిపదికగా చెప్పారు. ఈ విధాన మార్పును గమనించకుండా పాతకొత్త అంకెలను యాపిల్ పండ్లతో బత్తాయిలను పోల్చినట్లుగా ఉందని ప్రభుత్వం తిప్పికొట్టింది. పోలికను పక్కన పెడితే కొత్త అంకెలు వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదన్నదే సమస్య. అదే సమయంలో రద్దయిన విధాన అంకెలతో నూతన సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు, మోడీ ఎలా పోల్చారు ? అయితే నూతన విధానం గురించి ఒక స్పష్టత వచ్చేంత వరకు రెండు పద్దతుల ప్రాతిపదికన అంకెలను ప్రకటిస్తే జనాలకు స్పష్టత వస్తుందన్నది ఒక అభిప్రాయం. ప్రభుత్వం ఎంచుకున్న విధానం సరైనదే కావచ్చు గానీ గతంలో ప్రకటించిన ఆర్థిక సమాచారం సరైనదిగా రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం 201617లో పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ నుంచి 86శాతం నగదు ఉపసంహరణ, తదితర ఇబ్బందులతో ఆర్థిక రంగం కుదేలైందని చెప్పినప్పటికీ ఆ ఏడాది జిడిపి వృద్ధి రేటు 8.2శాతం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ ఏడాది జిడిపి అంకెలను ఆలశ్యంగా ప్రకటించారు,2017 సంవత్సర వినిమయ సర్వేను వెనక్కు తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేసిన నోట్ల రద్దు చర్యతో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని జనాన్ని నమ్మించేందుకు ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. గత సంవత్సర జిడిపిని తగ్గించి చూపి ఆ ప్రాతిపదికన ఈ ఏడాది తొలి మÖడునెలల్లో ఎక్కువగా ఉందని గొప్పలు చెప్పుకున్నారన్నది ఒక అభిప్రాయం. గత సంవత్సరానికి కూడా నూతన పద్దతిని అనుసరించి లెక్కించి దాని ప్రాతిపదికన 7.8శాతం వృద్ది అంటే నమ్మవచ్చు. కానీ అలా చేయలేదే ! గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసన్నట్లుగా ఆర్థికశాఖ కార్యదర్శిగా తాను ఉన్నపుడు జరిగిన అంకెల గారడీ తెలుసు గనుక సుభాష్ చంద్ర గార్గ్ చెప్పిన మాటలను అనేక మంది నమ్ముతున్నారు.

దేశ పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఐదేండ్ల కనిష్టానికి పడిపోయింది. ఆగస్టు నెలలో వరుసగా మÖడవ నెలలో కూడా పతనమైంది. దేశ పారిశ్రామికోత్పత్తి పిఎంఐ దీర్ఘకాల సగటు 54.2 కాగా జూలైలో 53.5 నుంచి ఆగస్టులో 52.8కి పతనమైంది. కొనుగోలు గిరాకీ పడిపోయింది. ఉపాధి గడచిన రెండున్నర సంవత్సరాల్లో తొలిసారిగా తగ్గింది. ఏప్రిల్జూన్ మÖడు మాసాల కరెంట్ ఖాతాలోటు 4.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. అయినా జిడిపి వృద్ది రేటు 7.8శాతమని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న జిడిపి లెక్కలకు విశ్వసనీయత సమస్య ఉంది. సంఘటిత రంగంలో ఉన్న పరిశ్రమలు, ఇతర సంస్థలు ఇచ్చే సమాచార ప్రాతిపదికన వాటిని రూపొందిస్తున్నారు.మన ఆర్థిక రంగంలో అసంఘటిత రంగ వాటా 45శాతం ఉందని ఉజ్జాయింపుగా వాటికి జోడిస్తున్నారు.నిర్దిష్ట సమాచారం లేదు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్(పిఐఐఇ) కోసం రూపొందించిన ఒక పత్రంలో గత దశాబ్దకాలంగా ఈ అంచనాలు వాస్తవం కాదని పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి మÖడు మాసాల్లో ఇంథన షాక్ చిన్న సంస్థల మీద ఎక్కువగా ఉన్నందున జిడిపి లెక్కలను నమ్మటానికి వీల్లేదంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఇంథనానికి కొరత ఏర్పడటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.ఇంథన దిగుమతులపై ఆధారపడిన మనం మెరుగైన వృద్ధి సాధించటం ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. అంతేకాదు గత దశాబ్దకాలంలో ఇంథన ధరలు చాలా తక్కువగా ఉన్నపుడు దేశ ఆర్థిక వ్యవ్యవస్థకు విపరీతమైన లాభాలు వచ్చి ఉండాలి, కానీ లెక్కల్లో అదెక్కడా కనిపించలేదు. దిగుమతి ధరలు 32శాతం పెరిగాయని, తొలి మÖడు మాసాల్లో ఆర్థికం మందగించిందని ఒకవైపు రిజర్వుబ్యాంకు చెప్పగా అంతా బాగుందని జిడిపి లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. నిజంగా ఆల్ ఈస్ వెల్ (అంతా సుభిక్షం) అనుకుంటే జిఎస్‌టి రాబడి కేవలం ఐదుశాతమే ఎందుకు పెరిగినట్లు ? పోనీ జిఎస్‌టి రేట్లు తగ్గించినందువలన అని సరిపెట్టుకుంటే దిగుమతులు తగ్గాయి, పారిశ్రామిక ఉత్పాదకత ఎందుకు పడిపోయినట్లు ? దేనికీ పొంతన కుదరటం లేదు. గతేడాది, 2025 ఏప్రిల్జూన్ మాసాల్లో జిడిపిని 86లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా దానిలో ఆరులక్షల కోట్లు తగ్గించారు. ఇప్పుడు ఏప్రిల్జూన్‌లో 88.27లక్షల కోట్లుగా చూపి దానితో పోల్చి 7.8శాతం పెరిగిందంటున్నారు. ఇదెక్కడి లెక్క ! ఇదేంటయ్యా అంటే విమర్శకులు తమకు అవసరమైన అంకెలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము 2023 మార్చి మాసాన్ని ప్రాతిపదికగా తీసుకున్నామని మోడీ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ సమర్ధించుకున్నారు. గతంలో జిడిపి మొత్తాన్ని సవరణలో ఎందుకు తగ్గించినట్లు అంటే తిరిగి లెక్కించినపుడు కొన్ని సార్లు పెరుగుతాయి, కొన్నిసార్లు తగ్గవచ్చు అన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో జిడిపిలో తగ్గించిన మొత్తం 43లక్షల కోట్లని కాంగ్రెస్ విమర్శించింది.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మన ప్రభుత్వ ఆర్థిక గణాంకాల పట్ల ఆందోళన వెల్లడిస్తూ ఏబిసిడి గ్రేడ్లలో “సి”లో మనలను ఉంచింది. అంటే నాసిరకం అని అర్ధం.


ప్రపంచంలో ప్రతిదేశమÖ తన ఆర్థికవృద్ది, ధరలు, ఇతర సూచికలను నవీకరించుకొనేందుకు ప్రాతిపదిక సంవత్సరాలను మార్చుతూ ఉంటుంది.ఆ ఏడాది అన్ని సూచికలనూ వంద అనుకుంటే తరువాత వచ్చే మార్పులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ పెరుగుదలతగ్గుదలను ఖరారు చేస్తారు. అయితే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రాతిపదిక ఏడాదిని మార్చాలన్నది సమస్య. దీనికి నిర్దిష్ట మార్గదర్శకాలేమీ లేవు. ఐరాస సూచించినదాని ప్రకారం ప్రతి మÖడు లేదా అయిదు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. చైనాలో విధిగా ప్రతి ఐదు సంవత్సరాలకు మారుస్తున్నారు. అమెరికాలో ఒక్కో అంశానికి ఒకో సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. జిడిపికి 2017, ధరలకు 198284ను, ఉత్పత్తి ధరలకు 1982ను తీసుకుంటున్నారు. జిడిపి అంకెల గారడీ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాం.ఒక ఏడాదిలో ఒక దేశం పది మిలియన్ పీపాల చమురు ఉత్పత్తి చేసిందనుకుందాం.ఒక్కో పీపాను పది డాలర్లకు అమ్మితే జిడిపి విలువ 100 మిలియన్ డాలర్లు. అదే మరోఏడాది కేవలం ఐదు మిలియన్ల పీపాలు మాత్రమే ఉత్పత్తి చేసింది, ధర మాత్రం 30 డాలర్లు ఉంటే జిడిపి 150 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఉత్పత్తి తగ్గినా జిడిపి పెరిగింది. నిజంగా జిడిపి పెరిగినట్లా తరిగినట్లా ? అందువలన ధరల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే అసలు పెరుగుదల తెలుస్తుంది.దాన్ని లెక్కించటం ఎలా ? ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నపుడు ఆ ఏడాది ఉన్న ధరలను బట్టి తరువాత సంవత్సరాల్లో పెరిగిన వాటిని ఆ ధరలకు అనుగుణంగా సరి చేస్తారు. పైన చెప్పుకున్న తొలి ఏడాదిని ప్రాదిపదికగా తీసుకుంటే రెండో ఏడాది ఉత్పత్తి జరిగింది ఐదు మిలియన్లే గనుక స్థిర ధరల్లో జిడిపి వందమిలియన్ల నుంచి 50కి తగ్గింది.మన ప్రభుత్వం గతేడాది వరకు 201112 సంవత్సరాల ధరలను ప్రాతిపదికగా తీసుకొని జిడిపిని లెక్కించింది. తాజా లెక్కలు 202223నాటి ధరల ప్రాతిపదికన చెప్పినవి.పదకొండు సంవత్సరాల కాలంలో ధరలు ఎంతగానో పెరిగాయి గనుక పాతవాటిని తీసుకుంటే వాస్తవ పరిస్థితి తెలియదు గనుక కొత్త సంవత్సరాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంత దీర్ఘకాలం పాటు ప్రాతిపదిక సంవత్సరాన్ని ఎందుకు కొనసాగించినట్లు ? కొత్త పద్దతిలో జిడిపిని తొలిసారిగా ప్రకటించారు, తదుపరి నెలల్లో వాస్తవ వృద్ధి రేటు తెలుస్తుంది, అప్పటి వరకు మనల్ని అంకెలతో ఆడుకుంటూనే ఉంటారు, గణాంకాలు కడుపు నింపవని వేరే చెప్పనవసరం లేదు !

బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

        బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబరు 12–13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. భారత్‌ 2012లో తొలిసారిగా బ్రిక్స్‌ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వగా, అనంతరం మరో మూడుసార్లు నిర్వహించింది. మన్మోహన్‌సింగ్‌ ఒకసారి, నరేంద్ర మోడీ మూడు సార్లు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ఒక సభ్యదేశం అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. వచ్చే ఏడాది చైనాకు ఈ బాధ్యతను ఢిల్లీ సమావేశం అప్పగించింది.“స్థిరత్వం, నవకల్పన, సహకారం, సుస్థిరత” అనే ఇతివృత్తంతో ఢిల్లీ ప్రకటనను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రాంతీయంగా తీవ్రమైన ఉద్రిక్త తలు కొనసాగుతున్న పరిస్థితుల్లో పదకొండు సభ్యదేశాల మధ్య ఐక్యత సాధించడాన్ని కొందరు భారత్‌ దౌత్యపరమైన పురోగతిగా అభివర్ణించారు. అయితే గత బ్రిక్స్‌ సమావేశాలను పరిశీలిస్తే ఏకాభిప్రాయ సాధన కోసం రాజీపడటం, వివాదాస్పద అంశాలపై తీవ్ర పదజాలానికి దూరంగా ఉండటం సాధారణమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించి, ప్రపంచ పాలనా వ్యవస్థలను సంస్కరించాలని బ్రిక్స్‌ కోరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాసలో తగిన ప్రాతినిధ్యం లేదని, వారి జనాభా, ఆర్థిక ప్రాధాన్యతకు అనుగుణంగా నిర్ణయాత్మక పాత్ర కల్పించాలని డిమాండ్‌ చేసింది.

ఇది భారత్‌, బ్రెజిల్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి పరోక్ష మద్దతుగా కొందరు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్ధమాన దేశాల వాటా పెరుగుతున్నందున ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ కోటా విధానాన్ని కూడా సమీక్షించాలని సమావేశం కోరింది. డాలరుకు ప్రత్యామ్నాయంగా వెంటనే ఒక ఉమ్మడి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టే నిర్ణయం మాత్రం తీసుకోలేదు. బదులుగా సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్య లావా దేవీలను పెంచుకోవాలని, స్థిరమైన సరఫరా వ్యవస్థలను నిర్మించు కోవాలని నిర్ణయించింది. పశ్చిమ దేశాలు ఏకపక్షంగా విధిస్తున్న పన్ను నిర్ణయాలను పేరు ప్రస్తావించకుండా విమర్శించింది. సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరులను ఆయుధాలుగా మార్చడాన్ని వ్యతిరేకించింది. గాజాలో జరిగిన మారణకాండను బ్రిక్స్‌ తీవ్రంగా ఖండించింది. అయితే ఇజ్రాయిల్‌, అమెరికా పేర్లను ఢిల్లీ ప్రకటనలో నేరుగా ప్రస్తావించలేదు. ఇరాన్‌పై జరిగిన దాడులను కూడా వ్యతిరేకిస్తూ దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పాలస్తీనాకు పూర్తిస్థాయి ఐరాస సభ్యత్వం కల్పించాలని, 1967 నాటి సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుతో పాటు తూర్పు జెరూసలేంను రాజధానిగా చేయాలని కోరింది. పహల్గామ్‌ దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాద దాడులను ఖండించింది.

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రవాణా, నావికుల భద్రతకు హామీ ఇవ్వాలని తీర్మానించింది. బ్రిక్స్‌లో ఏకాభిప్రాయమే ప్రధాన సూత్రం కావడంతో అనేక అంశాలపై రాజీ తప్పదు. అందువల్ల ఉమ్మడి కరెన్సీ విషయంలో కూడా నిర్దిష్ట చర్య తీసుకోలేదు. డాలరుకు ప్రత్యామ్నాయంపై చర్చ కొనసాగుతున్న ప్పటికీ తక్షణమే బ్రిక్స్‌ కరెన్సీ అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. డాలరును పక్కనపెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం చేస్తే బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి. మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు పేర్కొనబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలరు ఆధిపత్యం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బలపడింది. బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థలో ఒక ఔన్సు బంగారాన్ని 35 డాలర్లకు సమానంగా నిర్ణయించారు. 1971లో డాలరు-బంగారం సంబంధాన్ని అమెరికా తెంచిన తరువాత డాలరు మరింత స్వేచ్ఛగా అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా కొనసాగింది. యూరో ప్రవేశించినప్పటికీ డాలరుకు పూర్తి ప్రత్యామ్నాయంగా మారలేదు.

అయితే గత పాతికేళ్లలో డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 డిసెంబరు 2న ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉండగా, 2026 సెప్టెంబరు 15న అది 4,300 డాలర్లు దాటింది. డాలరును అమెరికా తన విదేశాంగ, ఆర్థిక విధానాల్లో ఆయుధంగా ఉపయోగి స్తోందనే ఆందోళన అనేక దేశాల్లో ఉంది. ఇరాన్‌, రష్యాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో వాటితో వాణిజ్యం చేయడానికి ప్రత్యామ్నాయ కరెన్సీల అవసరం ఏర్పడింది. స్విఫ్ట్‌ అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యా, ఇరాన్‌లను తొలగించడం కూడా ఇతర దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించే పరిస్థితిని కల్పించింది. డాలరును పూర్తిగా తిరస్కరించాలన్నది తమ లక్ష్యం కాదని, డాలరు లావాదేవీలపై పరిమితులు ఉన్నందున ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ డాలరును దెబ్బతీయడం తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కొన్ని వాణిజ్య భాగస్వాముల వద్ద డాలర్లు అందుబాటులో లేకపోవడం వల్ల స్థానిక కరెన్సీలలో లావాదేవీలు చేస్తున్నామని చెప్పారు.

రూపాయిలో వాణిజ్యం జరిగితే మారకపు విలువల హెచ్చుతగ్గుల ముప్పు తగ్గుతుంది. భారత్‌ ఇప్పటికే 24 దేశాలతో రూపాయి ఆధారిత లావాదేవీలకు అవగాహన ఏర్పరచుకున్నట్లు పేర్కొనబడింది. అయితే అమెరికాతో భారత్‌కు ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, ముఖ్యంగా ఐటీ, సేవలు, ఔషధ, వస్త్ర రంగాల పశ్చిమ మార్కెట్లపై ఆధారపడటం వల్ల డాలరుతో పూర్తిగా తెగతెంపులు చేసుకునే పరిస్థితి లేదు. చైనాతో వాణిజ్య లోటు ఉండగా అమెరికాతో మిగులు ఉండటం కూడా భారత్‌ వైఖరిని ప్రభావితం చేస్తోంది. బ్రిక్స్‌ జీడీపీలో చైనా వాటా సుమారు 70 శాతంగా ఉండటం మరో ముఖ్యఅంశం. ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పడితే దానిపై చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందనే ఆందోళన భారత్‌లో ఉంది. అందువల్ల భారత్‌ ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటూ, అవసరమైన చోట స్థానిక కరెన్సీ లావాదేవీలను మాత్రమే ప్రోత్సహి స్తోంది. ప్రపంచ జీడీపీలో అమెరికా వాటా 1960 దశకంలో సుమారు 40 శాతం ఉండగా 2026లో 25.64 శాతానికి తగ్గింది. చైనా వాటా 2000లో 3.6 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో భారత్‌ వాటా 1.4 నుంచి 3.29 శాతానికి పెరిగింది.

ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్‌ దేశాల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. విదేశీ మారక నిల్వల్లో డాలరు వాటా తగ్గుతున్న సమయంలో అనేక దేశాలు ఇతర కరెన్సీలతో పాటు బంగారం నిల్వలను పెంచు తున్నాయి. ప్రపంచ రిజర్వు బ్యాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1 టన్నులు కొనుగోలు చేశాయి. ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వ 880.52 టన్నులకు, చైనా వద్ద 2,313 టన్నులకు చేరింది. అమెరికా వద్ద 8,133 టన్నులు, జర్మనీ వద్ద 3,350, ఫ్రాన్స్‌ వద్ద 2,437, ఇటలీ వద్ద 2,452, జపాన్‌ వద్ద 846 టన్నుల బంగారం ఉన్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. బ్రిక్స్‌పై ట్రంప్‌ ఒత్తిడి ఉన్నప్పటికీ దాని ప్రధాన లక్ష్యం చైనా మార్కెట్‌, ఆర్థిక శక్తిని ఎదుర్కోవడమేనని ఈ పరిణా మాలను పరిశీలించినప్పుడు స్పష్టమవుతుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు చైనా గత కొన్నేళ్లుగా ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేస్తోంది. అమెరికా తీసుకున్న చైనా రుణం సుమారు 734 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2017 నుంచి చైనా దానిని క్రమంగా తగ్గిస్తోంది. చైనా తన వద్ద ఉన్న అమెరికా బాండ్లను పెద్ద మొత్తంలో విక్రయిస్తే ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే చైనాకూ నష్టం కలిగే ప్రమాదం ఉండటంతో అది జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

అమెరికాను ఎదుర్కొనేందుకు చైనా వద్ద మరో సాధనంగా యువాన్‌ విలువను తగ్గించడం, సెమీకండక్టర్లు, విద్యుత్‌ బ్యాటరీలకు అవసరమైన అరుదైన ఖనిజాల ఎగుమతులను నియంత్రించడం, అమెరికా కంపెనీల ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం వంటి అవకాశాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అయితే వీటిని చైనా వాస్తవంగా ఎంతవరకు ఉపయోగిస్తుందో చెప్పలేం. మొత్తంగా ఢిల్లీ బ్రిక్స్‌ సమావేశం అమెరికా, పశ్చిమ దేశాలకు డాలరు ఆధిపత్యం, ఏకపక్ష ఆంక్షలు, ప్రపంచ పాలనా వ్యవస్థల సంస్కరణ వంటి అంశాల్లో పరోక్ష హెచ్చరికలు చేసింది. అయితే ఉమ్మడి కరెన్సీ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోకుండా స్థానిక కరెన్సీల వాణిజ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిక్స్‌ విస్తరణ, స్థానిక కరెన్సీల వినియోగం, బంగారం నిల్వల పెంపు, డాలరు వాటా తగ్గడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులను సూచిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా మార్కెట్‌, డాలరు వ్యవస్థపై అనేక దేశాలకు ఉన్న ఆధారపడటం వల్ల ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. బ్రిక్స్‌ పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యతలో చైనా కేంద్రస్థానంలో ఉండటంతో, అమెరికా ఒత్తిడిలో ప్రధాన కేంద్రీకరణ చైనాపైనే కొనసాగుతుందనే అంశం ఢిల్లీ సమావేశం నేపథ్యంలో స్పష్టమవుతోంది.

ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు జరిపి బహిర్గతం చేసేంత వరకు ఏఐ డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వరాదని, ఇచ్చిన వాటిని అధ్యయనాలు చేసేంతవరకు నిలిపివేయాలంటూ ఏపీలోని విశాఖ పట్నంలో సెప్టెంబరు 6న జరిగిన జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. “విశాఖపట్నం ప్రకటన”ను ఆమోదించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్తమానంలో ఆర్థిక, సమాచార వ్యవస్థల్లో డేటా ఎంతో కీలకంగా మారింది. ఏదైనా కొత్త సమస్యలను సృష్టించకూడదన్నది పారిశ్రామిక విప్లవం నేర్పిన ఒక పెద్దపాఠం. పశ్చిమ దేశాల్లో కొన్ని పరిశ్రమల కాలుష్యం భరించరానిదిగా తయారుకావడంతో జనాల్లో వ్యతిరేకత, ఆరోగ్యం తదితర కారణాలతో ప్రభుత్వాలు అలాంటి వాటిని మూసివేయడం లేదా వేరే దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. ఆ సంస్థలు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడిన అధికారంలోని పెద్దలు పెట్టుబడులు, పరిశ్రమల రాక అంటూ ముద్దుపేర్లు తగిలించి తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో కొందరు రాజులు వలసవాదులకు మద్దతు ఇచ్చి దేశాన్ని వారికి ఎలా అప్పగించారో, ఆధునిక కాలంలో కొందరు పాలకులు వినాశకర పరిశ్రమలు, ఉత్పత్తులను అనుమతిస్తున్నారు.

ఉదాహరణకు ఇటలీలో మితేనీ రసాయన కర్మాగారంలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు తయారు చేశారు. దాని కాలుష్యంతో భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. సదరు ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లోటే పరశురామ్ అనే ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసి అదే రసాయనాలను ఉత్పత్తి చేశారు. చైనాకు సైతం అలాంటి కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి. అయితే వాటి ముప్పును గ్రహించిన అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. పాతబడిన నౌకలను ధ్వంసం చేయటం, గ్రీన్ రీసైక్లింగ్ పేరుతో పశ్చిమ దేశాల్లో తయారైన వ్యర్థాలను 2018లో నిషేధించింది. కానీ మనవంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. గ్లైఫోసేట్ అనే కలుపు నివారణ రసాయనాన్ని అనేక దేశాల్లో నిషేధించినా మన దేశం అనుమతించింది. అది కలుపు మొక్కలతో పాటు పచ్చగా ఉండే ప్రతిదాన్నీ హరించడంతో పాటు దాన్ని కూడా తట్టుకొని బతికే కలుపు మొక్కలు విస్తరించటంతో చివరకు నిషేధించాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో కాలుష్యకారక ఫ్యాక్టరీలు, ఉత్పత్తులతో పాటు డేటా సెంటర్లు కూడా పర్యావరణ సమస్యలను ముం దుకు తెస్తున్నాయి. దాంతో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడి సర్కార్ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో తలెత్తే పర్యావరణ ముప్పుపై ఎలాంటి నివేదికలు లేకుండా దొడ్డిదారిన దానికి అనుమతి ఇచ్చారు. అమెరికాను వదలి మనదేశానికి రావటం పెద్ద గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే అక్కడ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో ఇక్కడకు వస్తున్నాయి తప్ప మన మీద ప్రేమ కాదు. డెమాక్రాట్లు లేదా రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు, పట్టణాలు-గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఆందోళనలు సాగుతున్నాయి. వాటి సమీప ప్రాంతాల్లోని వారిలో వ్యతిరేకుల సంఖ్య 42 నుంచి 75 శాతానికి పెరిగినట్లు ఆగస్టులో చేసిన ఒక సర్వేలో తేలింది. గాలప్ సర్వేలో 53 శాతం మంది అణు విద్యుత్ కేంద్రాల సమీపంలో నివసించటానికి మొగ్గు చూపగా, డేటా కేంద్రాల వద్ద ఉండేది లేదని 71 శాతం చెప్పటం గమనించాల్సిన అంశం. భూమితో పాటు ఆ కేంద్రాలను చల్లబరచేందుకు భారీ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. గాలిలో కాలుష్యాన్ని పెంచుతాయి, వాతావరణం వేడెక్కుతుంది. అందుకే సమీపాల్లో నివసించేందుకు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరమైన అనుమతుల కోసం స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు అందిస్తున్నట్లు ఫుడ్ అండ్ వాటర్ వాచ్ సంస్థ రాజకీయ డిప్యూటీ డైరెక్టర్ థామస్ మేయర్ చెప్పాడు.

మరోవైపు కృత్రిమ మేథ(ఏఐ)తో వచ్చే ప్రయోజనాల గురించి కొందరు నేతలు ఊరిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఏఐ బుడగ పేలిపోయి జూలై నెలలో స్టాక్ మార్కెట్‌లో 2.18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇలాంటి బుడగలు పేలితే మొత్తం ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలో వందలాది సంస్థలతో “డేటా సెంటర్ల నిలిపివేత కూటమి” ఏర్పాటైంది. పర్యావరణ రక్షణ అంశంలో లోపభూయిష్టంగా ఉన్న అమెరికా ఏఐ చట్టాన్ని రక్షించాలంటూ డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు చేసిన యత్నాన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు వమ్ము చేశాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు డేటా సెంటర్ల ఏర్పాటును వాయిదా వేయాలని తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ దేశంలో తొలిసారి డేటా సెంటర్లు వద్దని తీర్మానం చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో వీటి ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను గుర్తించారు. వీటి నిర్మాణానికి భారీ యంత్రాల వినియోగంతో ధ్వని కాలుష్యం పెరిగింది. డీజిల్ జనరేటర్లతో వేడి పెరుగుతున్నది, ఎయిర్ కండిషనర్లు నిరంతరం రొద పెడుతున్నాయి. ఈ కేంద్రాలలో రాత్రంతా వెలుగు ఉండటంతో పరిసరాల జనాల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని వెలుగు కాలుష్యం అంటున్నారు. కొన్ని కేంద్రాలు గ్యాస్‌తో నడుస్తూ కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మొత్తం డేటా సెంటర్ల కారణంగా 2030 నాటికి ఆరు లక్షల మందిలో ఆస్మా లక్షణాలు కనిపిస్తాయని, 1,300 మంది ముందుగానే చనిపోతారని, ఏటా ఆస్మాతో మరణిస్తున్నవారి కంటే మూడోవంతు మరణాలు పెరుగుతాయని, ప్రజారోగ్య రక్షణకు ఏటా అదనంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది. ఒక పెద్ద సెంటర్‌లోని కంప్యూటర్ యంత్రాలను చల్లబరచేందుకు రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు(అమెరికా గాలన్ 3.8 లీటర్లకు సమానం) అవసరం. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గూగుల్ సంస్థ ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, మరో ఆరింటిని నిర్మిస్తున్నట్లు 2025 నివేదిక ఒకటి వెల్లడించింది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా అనే ప్రాంతంలో నాలుగు కేంద్రాల కారణంగా భూగర్భజలాల కొరత ఉందంటూ 2023లోనే కొత్తగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేశారు. డేటా కేంద్రాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. వాటికోసం సరఫరా వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు తడచిమోపెడు అవుతుంది. ఆ మొత్తాన్ని దామాషా ప్రకారం అయినా గృహ వినియోగదారుల మీద కూడా మోపుతారు, అది వారి మీద అదనపు బాదుడే. ఈ విధంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరవై శాతం రేట్లు పెరిగాయి.

అంటే కార్పొరేట్ల లాభాల కోసం సాధారణ పౌరులు అదనపు భారం మోయాలి. పౌరుల నుంచి వ్యతిరేకత రావటంతో డేటా సెంటర్లు తమకు అవసరమైన విద్యుత్‌ను వారే ఉత్పత్తి చేసుకోవాలి లేదా స్థానికుల మీద భారం పడకుండా అదనపు చార్జీలు చెల్లించాలని రాష్ట్ర గవర్నర్ జోష్ షాప్రియో ప్రకటించాల్సి వచ్చింది. డేటా సెంటర్లు వద్దనే ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్‌లోని జీవూల్డే అనే 22 వేల మంది ఉన్న పట్టణంలో మేటా 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 మెగావాట్ల కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఆ పట్టణం మొత్తం వినియోగించే విద్యుత్‌కు రెండు రెట్లు ఈ కేంద్రానికి అవసరమని తేలడంతో అక్కడి జనాలు దాన్ని వ్యతిరేకించారు. నెదర్లాండ్స్ ప్రభుత్వమే డేటా సెంటర్లు 70 మెగావాట్లకు మించి పెట్టరాదని నిర్ణయించడంతో మేటా కేంద్రం రద్దయింది. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డేటా సెంటర్‌ను వ్యతిరేకించిన వారే గెలిచారు. ఐర్లండ్‌లో వ్యతిరేకత కారణంగా యాపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల ప్రాజెక్టును రద్దు చేసుకుంది. జనాల అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్కడి డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం పదేండ్ల క్రితం దేశం మొత్తం వినియోగించే విద్యుత్‌లో కేవలం ఐదు శాతం ఉండగా, గతేడాది 23 శాతానికి చేరింది. 2034 నాటికి 31 శాతం కానుంది.

చిలీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రంపై పర్యావరణ ప్రభావం గురించి తగిన నివేదిక ఇవ్వక పోవటంతో కోర్టు అడ్డుకున్నది. అదే గూగుల్ మరోచోట ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రాన్ని జనం అడ్డుకున్నారు. ధనిక దేశాల వారు వినోదం కోసం ఏఐ చిత్రాలను రూపొందించేందుకు మా నీటిని ఫణంగా పెట్టి డేటా కేంద్రాల నిర్మాణం అవసరం లేదని చిలీ నీటి హక్కుల సంస్థ ప్రతినిధి టానియా రోడ్రిగజ్ స్పష్టం చేశారు. ఉరుగ్వేలో గూగుల్ తలపెట్టిన కేంద్రానికి 20 లక్షల గ్యాలన్ల నీరు కావాలని తేలటంతో జనం వ్యతిరేకించారు. చివరకు చల్లబరిచేందుకు నీటిని వాడబోమంటూ చిన్న కేంద్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల్లో కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకత పెరుగుతున్నది. డేటా సెంటర్లకు సంబంధించి కొన్ని అవాస్తవాలు-నిజాల గురించి చూద్దాం. అమెరికా అనుభవంలో నిర్మాణ సమయంలో ఉపాధి తప్ప పర్మినెంట్ ఉద్యోగాలు ఒక పెద్ద కేంద్రంలో 50 నుంచి 150 మందికి లభిస్తాయి. అవి కూడా భద్రతా సిబ్బంది, నిపుణులైన సాంకేతిక నిపుణులకే పరిమితం. అదనపు పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వాలకు అదనపు పన్నులూ రావు, ప్రజల సొమ్ము వాటికి ఖర్చు చేస్తారు. స్థానిక వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జార్జియా రాష్ట్రంలో 70 శాతం కేంద్రాలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు.

ఈ కేంద్రాలను చల్లబరిచేందుకు ఉపయోగించే నీటిని తిరిగి విడుదల చేసినప్పుడు అవి వేడిగా ఉంటాయి. నీటి వనరులు, పర్యావరణాన్ని ప్రభావితం చేసే కొత్త సమస్యలను సృష్టిస్తాయి. చైనాలో కూడా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయి. అందుకే చైనా సముద్రాల్లో 35 మీటర్ల లోతులో తేలియాడే వాటిని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. షాంఘై తీరంలో రెండువేల సర్వర్లు ఉన్న కేంద్రాన్ని 115 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాట్ల వలన 90 శాతం ఇంధనం ఆదా అవుతుంది, అవసరమైన విద్యుత్‌లో 97 శాతం సమీపంలోని ఉపరితల గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. బ్రిటన్‌లో మైక్రోసాఫ్ట్ జరిపిన ప్రయోగంలో భూమి మీద ఏర్పాటు చేసిన వాటి కంటే నీటిలో వాటి వైఫల్యాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా వాణిజ్యపరంగా ముందుకు పోలేదు. భూమి మీద ఏర్పాటు చేసే డేటా సెంటర్ల ప్రాజెక్టు మొత్తం విద్యుత్‌లో చల్లబరిచేందుకే 40 శాతం అవసరం కాగా, సముద్రాల్లో వాటికి అది అవసరం ఉండదు. విద్యుత్ వినియోగ సామర్థ్యం సముద్రాల్లో ఎక్కువని తేలింది. నీటి అవసరం ప్రత్యేకంగా ఉండదు. చల్లబరిచేందుకు అవసరమైన వ్యవస్థల ఖర్చు సముద్రంలో తక్కువ, భూమి అవసరం 90 శాతం తక్కువ. ఉపాధి పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి వారు భారీ మొత్తాల్లో అప్పనంగా సబ్సిడీలు ఇస్తున్నపుడు ఎవరైనా వాటిని ఎందుకు వదులుకుంటారు? ప్రత్యామ్నాయాల వైపు చూడటానికి వారేమైనా ప్రజల పక్షం వహించేవారా!

భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


‘‘హిందువులు నిద్రలేస్తే ప్రపంచం మేల్కొన్నట్లే” ఇదీ అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటనలో భాగంగా కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన సభలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భగవత్ చెప్పిన సుభాషితం. ఎంతో చక్కగా చెప్పారు, ఇంతకూ హిందువులు ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పకుండా అది జరిగితే, ఇదైతే అని చెప్పటం వల్ల ఉపయోగమేమిటి? నిద్ర లేవకుండా ఎవరు అడ్డుకున్నారు? భగవత్ మూడు దేశాల పర్యటన అన్ని చోట్లా తీవ్ర వివాదాన్ని రేపింది. అవి నోరున్న దేశాలు గనుక వార్తలు ప్రపంచవ్యాపితంగా వెళ్లాయి. మనదేశ మీడియాలో కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ, తెరవెనుక ఉండి దాన్ని ఆడిస్తున్నది మాతృసంస్థ ఆరెస్సెస్‌ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి సంస్థ అధినేత పర్యటన అంటే ఒక రాజ్యాంగేతర శక్తి చేస్తున్నట్లే భావించాలి. తనను ఒక సాంస్కృతిక సంస్థగా కాషాయదళం చెప్పుకుంటుంది. కానీ, ప్రపంచానికి అది మేకతోలు కప్పుకున్న పులి, ఒక మతోన్మాద సంస్థగా అనేక మంది భావిస్తున్నారు. ఆ మచ్చను తుడిచివేసుకొనేందుకు వంద సంవత్సరాల క్రితం అది పుట్టినప్పటి నుంచీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.

భారత్ విశ్వగురువుగా మారింది తప్ప విశ్వశక్తి కాదని టొరొంటో సభలో ఆరెస్సెస్‌ అధినేత చెప్పారు. ప్రపంచ మిలిటరీ, జీడీపీలో అగ్రభాగాన ఉన్నందున అమెరికా ప్రపంచశక్తి అని భావిస్తే అదొకతీరు. మనం ఏ రంగంలో ముందున్నట్లు, గురువుగా ప్రపంచానికి నేర్పిందేమిటి? “హిందూ విశ్వ బంధు-స్నేహ బంధంతో ప్రపంచ ఆలింగనం” అనే ఇతివృత్తంతో కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్(కోర్డ్) సంస్థ ఏర్పాటు చేసిన సభలో భగవత్ మాట్లాడుతూ భారత్ సూపర్ పవర్ కాదని, తన స్వంత వ్యక్తిత్వంతో ప్రపంచానికి సేవలు అందించిందని, భారత్ ఎదుగుదలను ఆధిపత్యంతో కాక సేవతో కొలవాలని అన్నారు. సేవ భారత జన్యుమూలాల్లోనే ఉందని, హిందువులు మేలుకొంటే ప్రపంచమే నిద్రలేచినట్లని చెప్పారు. ముస్లింలు, పార్సీలు, యూదులు, క్రైస్తవులు ఎక్కడైనా వేధింపు లకు గురైతే భారత్‌లో ఆశ్రయం దొరికిందని, భారత పూర్వీకులు దేశాలను ఆక్రమించేందుకు కాక జ్ఞానాన్ని పంచేందుకు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.ఇక్కడ సమస్య యావత్ ప్రపంచానికి మన పూర్వీకులు జ్ఞానం ప్రసాదిస్తే, అది మన వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం వినియోగించుకోకుండా “మ్లేచ్చులకు” అందించి వారు విమానాలు, క్షిపణులను తయారు చేసేందుకు ఎందుకు సహకరించినట్లు? పారిశ్రా మిక విప్లవాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండి, సమాజాన్ని నిచ్చెనమెట్ల వివక్షా పూరితంగా ఎందుకు తయారు చేసుకున్నాం. సముద్రాలు దాటి ప్రయాణించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎందుకు నిబంధనలు విధించినట్లు?

మనపూర్వీకులు ప్రపంచాన్ని చుట్టి జ్ఞానాన్ని అందిం చారని చెబుతున్న వారు ప్రయాణాలను నిషేధించిన బౌధాయన ధర్మశాస్త్రం, మనుస్మృతి గురించి ఏం చెబుతారు. సముద్రాలు దాటితే కుల భ్రష్టులౌతారు, ఆచారాలు మంటకలుస్తాయని చెప్పిన ఆంక్షల నేపథ్యంలో భగవత్ చెప్పిన పూర్వీకులు విదేశాలకు వెళ్లారంటే వారు తిరుగుబాటుదారులై ఉండాలి. అలాంటి వారిని పొగుడుతున్న కాషాయ దళాలు మరోవైపు మనుస్మృతిని విమర్శించే వారిని హిందూ వ్యతిరేకులు అని ఎందుకు నిందిస్తున్నట్లు? సనాతనాన్ని కాపాడాలి లేదా పునరుద్ధరిం చాలని చెబుతున్నవారు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నట్లా, వెనక్కు నడపాలని చూస్తున్నారా? జనాలు ఊరూపేరులేని వాట్సాప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా స్వంత మెదళ్లకు పని పెట్టాలి. హిందూ అంటే మతం కాదు, జీవన విధానం అని చెబుతారు. “నేను హిందూ అని చెప్పినపుడు ఆ పదాన్ని ఒక నిర్దిష్ట భాష, ప్రత్యేక ఆరాధన రూపం, లేదా ఏ జీవన శైలితోనూ నిర్వచించకూడదు. హిందువులు అందరినీ గౌరవించాలి, అందరినీ ఆమోదించాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి,” అని భగవత్ చెప్పారు. ఆచరణలో కాషాయ దళాలు అలాగే ఉన్నాయా? ఒకవైపు వసుధైక కుటుంబం అని చెబుతారు. మరోవైపు దేశంలో జనాభాను పెంచుతూ ముస్లింలు మెజారిటీగా మారేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ, హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రబోధించటం తెలీదా? దక్షిణ భారత్‌లో ఉన్న హిందువులు కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తున్నారు, ఉత్తర భారతంలోని వారు ఎందుకు ముందుకు రావటం లేదు? జనాభా నియంత్రణ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ సగటు జననాల రేటు 2.23 కాగా, అంతకంటే తక్కువగా ఉన్న ముస్లిం దేశ సమాజాలు కూడా ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని మతపరంగా ముస్లింలతో నింపాలనే కుట్ర ఉంటే మాల్దీవులు, మలేషియా, బహరెయిన్, ఇరాన్, టర్కీ వంటి చోట్ల మనకంటే తక్కువగా జననాల రేటు ఎందుకు ఉన్నట్లు? ఏ దేశానికైనా జనాభా వృద్ధి రేటు 2.1గా ఉండాలన్నది ఆ రంగ నిపుణుల సిఫార్సు. మనదేశంలో సగటు రెండుగా ఉంది. ఇక మతాల వారీ చూస్తే ముస్లింలు 2.36, హిందువులు 1.94 ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1992లో ముస్లింలలో 4.41గా ఉన్న పిల్లలు 2019-21 నాటికి 2.36కు తగ్గారు. ఇదే కాలంలో రెండు మతాల వారి మధ్య ఉన్న తేడా 1.11 నుంచి 0.42కు తగ్గింది. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు, నమ్మేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు? యావత్ ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్ భగవత్ సెలవిస్తారు. వారి రాజకీయ ప్రతినిధి బీజేపీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెబుతుంది. చట్టసభల ఎన్నికల్లో మాత్రం దేశంలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తమ అభ్యర్ధులుగా నిలపదు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చెప్పే పార్టీ మత వివక్షతో అసలు అవకాశం కల్పించకపోవటాన్ని మతోన్మాదం లేదా మతవిభజనగాక ఏ పేరుతో పిలవాలి? మోహన్ భగవత్ పర్యటనకు మూడు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ సమస్య వ్యక్తిగతం కాదు. భావజాలం, విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆచరణకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

ఆరెస్సెస్‌ సభతో కెనడాలో సామాజిక అశాంతి తలెత్తుతుందని, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, సిక్కులు, దళితులకు ముప్పు తలెత్తుతుందని ఎన్‌డిపి పక్ష ఎంపీలు ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. అక్కడి పౌర సమాజంలోని 267 సంస్థలు, బృందాలు కూడా భగవత్ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదని, ఆరెస్సెస్‌ను నిషేధించాలని కోరాయి. దీనికి పోటీగా వందకుపైగా ఇండో-కెనడియన్ హిందూ సంస్థలు రాసిన లేఖలో ఆధారం లేకుండా నిషేధం విధించటం అన్యాయమైన రాజకీయ వత్తిడి అని, భగవత్ పర్యటనను అడ్డుకోవటమంటే కెనడా హిందూ సమాజం పట్ల వివక్ష చూపటమేనని పేర్కొన్నాయి. కెనడా మాజీ రక్షణ మంత్రితో సహా మరికొందరు ఆరెస్సెస్‌కు మద్దతు పలికారు. బ్రిటన్‌లో దక్షిణాసియా సంతతికి చెందినవారు, మానవహక్కుల బృందాలు పర్యటనను వ్యతిరేకించాయి. వసుధైక కుటుంబ ఉత్సవాల ముసుగులో అమెరికాలో ఏర్పాటు చేసిన మోహన్ భగవత్ పర్యటనపట్ల కూడా వ్యతిరేకత వెల్లడైంది. సభ జరిగిన మాడిసన్ స్క్వేర్ న్యూయార్క్ నగరంలో ఉంది. ఆ నగర మేయర్ జోహ్రాన్ మందానీ ఆరెస్సెస్‌ నేత పర్యటనకు తాను వ్యతిరేకమని, అయితే ఒక మేయర్‌గా భగవత్ కార్యక్రమాలను అడ్డుకొనే అధికారం తనకు లేదని చెప్పారు. జోహ్రాన్ తండ్రి గుజరాతీ మూలాలున్న అమెరికా పౌరుడు మహమ్మద్ మందానీ, తల్లి ప్రముఖ భారతీయ సినిమా దర్శకురాలు మీరా నాయర్. మూడు పదులు దాటిన జోహ్రాన్ న్యూయార్క్ నగరానికి తొలి ఇండియన్-అమెరికన్ మేయర్‌గా చరిత్రకెక్కారు.

అమెరికా పార్లమెంట్‌కు సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్చ అమెరికా కమిషన్ (యుఎస్‌సిఐఆ‌ర్‌ఎఫ్) అమెరికా ప్రభుత్వ అధికారులు భగవత్‌ను కలవరాదని కోరింది. ఆరెస్సెస్‌ ఉపసంఘాలు మతపరమైన మైనారిటీల మీద హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆ సంస్థ నివేదికలో పేర్కొన్నది. ఈ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి విశ్వసనీయత లేదని మన విదేశాంగ శాఖ ఆరెస్సెస్‌ను వెనుకేసుకు వచ్చింది. తీవ్ర వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో సభా నిర్వహకుల ఎక్స్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిలిపివేసి వత్తిడి తరువాత పునరుద్ధరించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సభకు హాజరయ్యేవారికి సూచించింది. ఇలాంటి సంస్థలు ఎంతగా రెచ్చగొట్టినా ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు లేకుండా కార్యక్రమం ముగిసింది. ఆరెస్సెస్‌ వ్యాపింపచేస్తున్న పచ్చి అవాస్తవాలు ఎన్నో. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే అంతకు ముందే తమ సంస్థనుంచి వెళ్లిపోయి హిందూమహాసభలో చేరాడన్నది వాటిలో ఒకటి. అయితే గాడ్సే ఎప్పుడు ఆరెస్సెస్‌లో చేరిందీ, ఎప్పుడు వెళ్లిపోయిందీ ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆ సంస్థ సభ్యత్వం రహస్యం. నాధూరామ్ గాడ్సే, అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తలని, వారెప్పుడూ సంస్థ నుంచి బయటకు పోలేదని కుటుంబ సభ్యులు పదే పదే స్పష్టం చేశారు.గోపాల్ గాడ్సే మనుమడు సాత్యకీ సావర్కర్ ఒక పరువు నష్టం కేసులో 2026 ఆగస్టు నెలలో పూనా కోర్టులో సాక్ష్యమిస్తూ అదే చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సావర్కర్, గాడ్సే కుటుంబాలకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాల గురించి సాత్యకి చెప్పిన అంశాలను ప్రచురించింది. గాడ్సే కోర్టులో చేసిన వాదనలను పుస్తకరూపంలో అచ్చువేసి ప్రచారంలో పెడుతున్నది కాషాయ దళం తప్ప మరొక “దేశభక్తుడు” ఎవరూ కాదు. అయినా సరే గాడ్సేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్‌ పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మోహన్ భగవత్ మూడు దేశాల పర్యటన సందర్భంగా ఆర్గనైజర్ పత్రికలో దాన్నే పునరుద్ఘాటించారు.

పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !

Tags

, , , , , , , , ,

ఎం.కోటేశ్వరరావు

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా ( భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. “ఉన్నమాట అన్నా వు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన మాట” అనే సినిమా పాటను గుర్తుచేశారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతు న్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. “రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయిం చండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి” అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులిస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపిం చటం లేదు, అయినా పదే పదే చెబుతున్నారంటే దాన్నే మనాలి? భారత తయారీ సప్తధారల్లో జరగాలని మోడీ చెప్పారు. చెప్పిన మాట చెప్పకుండా తన కార్యాలయం రాసిచ్చిన ఉపన్యాసాలను కొత్త కొత్త పదజాలంతో కాశీ మజిలీ కథల మాదిరి ఊకదంపుడుతో కొత్తవాటిని చెప్పటం తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండేండ్లుగా ఎవరు వద్దన్నారు.

ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్‌లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మనదేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడపదాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి.2014 నుంచి అధికారం లో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో 40వదిగా, చైనా 21వ స్థానంలో ఉంది.

పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చా నని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. ‘బుద్దులు భూములను ఏలుతుంటే రాతలు గాడిదలను కాస్తున్నాయనే’ లోకోక్తిని ఇక్కడ గుర్తు చేయకతప్పటం లేదు. మోడీ అధికారానికి వచ్చినపుడు కమ్యూనిస్టు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చినెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్యలోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్యలోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం చూశారా మోడీ ఘనత అంటూ అడ్డుసవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగం లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ లిస్తున్నది గనుక అనేక కంపెనీలు మనదేశం లోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతు లు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు ? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి ?

ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నిటి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి. ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేండ్ల నుంచి ఎందుకు విఫలమ య్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా? ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రయివేటు పెట్టు బడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నిటిఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జీడీపీలో 25-26 శాతం ప్రయివేటురంగ పెట్టు బడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి, అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలిచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రయివేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జీడీపీని 30లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20ఏండ్లు ఏటా పదిశాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబు తున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు… తనదిగాకపోతే కాశీ వరకు తాటిపట్ట మీద దేకవచ్చాన్నడట వెనుకటికి ఎవడో.

ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పదిశాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదుశాతం కలిగి ఉంది.ఇదే సమయంలో మన వాటా 1.6-1.8శాతం మధ్య ఉంది, అది 2014నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడుశాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది. ఆశలు, ఊహలు, అడుక్కొనే విషయాల్లో పిసినారితనం ఉండకూ డదంటారు పెద్దలు.ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మనదేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం లోని ఆకాశానికి నిచ్చెనలు వేసే చంద్రబాబు వంటి వారు చెబితే నమ్మేదెలా ? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్ని అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధార పడాల్సిన పనిలేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది.

అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నిటి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరుశాతమే, 2030 నాటికి 45శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తదితర ధనిక దేశాలు 1948లో సోవియట్ యూనియన్, చైనా లేకుండా 23 స్థాపక దేశాలతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్(గాట్-పన్నులు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం) జరిగింది. దీనిలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. అది 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మారింది. అయినప్పటికీ 2001 వరకు చైనాను దానిలో చేరకుండా అడ్డుకున్నారు.అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతూ చౌకగా అనేక ఉత్పత్తులను అందచేస్తున్న క్రమంలో తమ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదేశాలే సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత బీజింగ్ వెనుదిరిగి చూడలేదు, ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగాయి. నవీకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వచ్చాయి. మేడిన్ చైనా 2025 వంటి లక్ష్యాలు, అందుకు అవసరమైన విధానాలతో ముందుకు పోవటమే గాక అవసరమైన కార్మికశక్తి నైపుణ్యాల ను కూడా పెంచింది.

రవాణా సదుపాయాల మెరుగుదలకు విస్తరించిన రోడ్లు,రైలు, బుల్లెట్ రైళ్లను చూసి అవసరం లేకున్నా నిర్మించిందని విమర్శించిన వారే ఇప్పుడు ఔరా ఎంత ముందు చూపుతో చేశారని ముక్కున వేలేసుకుంటు న్నారు. నిజానికి మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంతో స్థానికంగా కొనుగోలు శక్తికూడా పెరిగింది. తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నేడు ఎంతో లాభసాటిగా మారాయి.2010 నుంచి పారిశ్రామిక ఉత్పత్తికి దోహదం చేయటంలో చైనా ప్రధమ స్థానంలో కొనసాగు తోంది. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించాల ని చూశారు. ఇప్పుడది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించేందుకు పూనుకున్నారు. వారికి చైనా కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఏడుపు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా రానున్న రోజుల్లో సరఫరా కేంద్రంగా కూడా మారనున్నదని దోపిడీదార్లు భయ పడుతున్నారు. జపాన్ సుజుకీ కంపెనీ మనదేశం లో మారుతీ కార్లకు కీలక విడి భాగాలను అందిస్తున్నట్లే చైనా అను సరిస్తున్నది. దుస్తుల రంగంలో 2023 వివ రాలను చూసిన పుడు చైనా ముడిసరకు ఎగుమతులు 16, ఇంటర్‌మీడియెట్ ఉత్పత్తులు 21,పాక్షికంగా తయారైనవి 47, పూర్తిగా తయారైనవి 30శాతం ఉన్నాయి. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పలకల్లో పూర్తిగా తయారైనవి 54శాతం చొప్పున ఉన్నాయి.

విద్యుత్ వాహనాల లో 51శాతం పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నది. ఇవన్నీ గిరాకీ మీద ఆధారపడి ఉన్నాయి.అనేక దేశాలు చైనా నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటితో పూర్తి వస్తువులను తయారు చేస్తున్నారు. అది లాభసాటిగా ఉన్నంత కాలం సాగుతుంది.చైనా లావాదేవీలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే జరుగుతున్నందున అమెరికా, మరికొన్ని దేశాలకు కడుపు మంటగా ఉంది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను కబళించేందుకు చూసిన శక్తులు నేడు అది విఫలమైందని, చైనా తొండి ఆట ఆడుతున్నదని అంటూ పూర్వపు రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నారు.పురాతన కాలంలో వివిధ దేశాల మధ్య వస్తు వ్యాపారం ఉన్నట్లు చరిత్రలో నమోదైంది. అయితే వర్తమానంలో ఎగుమతులు-దిగుమతుల క్రమం 1870లో ప్రారంభమైందని చెబుతు న్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత వస్తూత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ఇది జరిగింది.

బ్రిటన్ ఎగుమతుల్లో ప్రధమ స్థానంలో ఉంది, ఒక దశలో అది ఎగుమతి చేసిన వాటిలో 42శాతం భారత ఉత్పత్తులు ఆక్రమించాయి.బ్రిటన్ తరువాత రెండవ స్థానంలో జర్మనీ హవా నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ముందుకు వచ్చింది .1980,90దశకాల్లో జపాన్ ఎలక్ట్రానిక్స్‌తో ప్రపంచాన్ని నింపివేసింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నుంచి చైనా అగ్రస్థానానికి చేరింది.1948లో ప్రపంచ వస్తు ఎగుమతుల విలువ కేవలం 59 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా 2025లో 26లక్షల కోట్ల డాలర్లు దాటింది.దానిలో చైనా వాటా ముందే చెప్పుకున్నట్లు 4లక్షల కోట్ల డాలర్లు దాటింది. నల్లమందు భాయీలని ప్రపంచం ఈసడించిన చైనీయులను పూర్తిగా మార్చి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించిన ఘనత ఇది! కాదంటారా !!

ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

గడచిన పదేండ్లలో ప్రపంచ వృద్ధి రేటులో పెద్ద మార్పు లేదు. కానీ అదే సమయంలో కొంత మంది సంపద విపరీతంగా పెరిగింది. ధనవంతుల సంఖ్యలో కూడా అదే తీరు. పేదలు మరింతగా పేదలౌతున్నారు. ఎందుకిలా జరుగు తోంది? యుబిఎస్ అనే పెద్ద స్విస్ బ్యాంకు 2026 సంవత్సర ప్రపంచ సంపద నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(వంద కోట్ల డాలర్లు, ప్రస్తుత విలువ ప్రకారం రూ.9,562 కోట్ల 34లక్షల,50వేలు) అంతకు మించి సంపద ఉన్నవారి సంఖ్య 2025లో ప్రపంచంలో 3,302 మంది ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 383 మంది(13.1శాతం) పెరిగారు. వీరిలో వెయ్యి మందికి పైగా అమెరికా, 562 మంది చైనా, 211 మంది మనదేశంలో ఉన్నారు. తరువాత స్థానాల్లో జర్మనీ 193, రష్యాలో 122 మంది తేలారు. సగటున వీరి సంపద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 25శాతం పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఎన్నోరెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, హంగరీలో పెరుగుదల రేటు రెట్టింపు కాగా, చిలీలో 80, చెక్, మెక్సికోలలో 60, బ్రెజిల్, గ్రీస్‌లలో యాభై శాతానికి మించి ఉంది. ఈ వివరాలు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ సమాచారం మేరకు వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఏడాది కాలంలో బిలియనీర్లు 31 నుంచి 52కు పెరిగారు.

అయితే ప్రపంచ మంతటా అలాగే ఉందా? కొన్ని దేశాల్లో స్ధిరంగా, కొన్నిచోట్ల తగ్గారు. చిలీలో పెరగకపోగా థాయ్‌లాండ్‌లో 25 నుంచి 22కు, సౌదీ అరేబియాలో19 నుంచి 16కు తగ్గారు. గతంలో లక్ష రూపాయల సంపద ఉంటే లక్షాధికారి అని పిలిచారు. ఇప్పుడు వారి స్థానంలో మిలియనీర్ (అంటే కనీసం పది లక్షలు)లు వచ్చారు. ఇది కూడా అమెరికన్ డాలర్లలో లెక్కవేస్తున్నారు. ఇలాంటి వారు గతేడాది 1.5శాతం మంది పెరిగారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే రోజుకు 2,680 మంది కొత్తగా మిలియనీర్లు అయ్యారు. తూర్పు ఐరోపాలో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. గతేడాది మొత్తం పదిలక్షల మంది కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరితే వారిలో సగం మంది ఒక్క అమెరికాలోనే ఉన్నారు. ప్రపంచంలో అధిక సంపద ఉన్న దేశం అమెరికా అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి జనాలందరూ ధన వంతులా అన్నది అసలు సమస్య. సగటు ఆదాయం, సగటు సంపదకూ, మధ్యగత రాబడి, సంపదకూ తేడా ఉంది. దాన్ని అర్ధం చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికన్లందరూ ఎలన్ మస్క్‌లు కారు. మనదేశంలో అంబానీ, అదానీలు ఎలా ధనవంతులో జనం అందరి స్థితి అది కాదని తెలిసిందే. యుబిఎస్ నివేదిక 30 ధనిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాల గురించి సగటున ఒక వ్యక్తి సంపద ఎంత అని విశ్లేషించింది.

ఒక దేశ సంపద విలువను జనాభాతో భాగిస్తే సగటు ఎంతో తెలుస్తుంది. ఒకడి దగ్గర లక్ష, మరొకడి దగ్గర వెయ్యి రూపాయలుంటే సగటు ఇద్దరి రూ.50,500 అవుతుంది. లొట్టలేసుకుంటూ చెప్పే ఈ అంకెలతో రెండవ వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా! ఈ లెక్కన స్విట్జర్లాండ్ సగటు సంపదలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవది. మీడియన్ సంపద (మధ్యగత)ను చూస్తే అదే అమెరికా 28వ స్థానానికి దిగజారింది.మరో మాటలో చెప్పాలంటే 27 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఊరిలో పది మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయను కుందాం. సగటున చూసినా, మధ్యగతంగా చూసినా వెయ్యి రూపాయలే ఉంటాయి. అంటే సంపద అందరి దగ్గరా సమంగా ఉన్నట్లు. అదే ఊరిలోని మరో పది మందిలో ఒకడి దగ్గర లక్ష ఉండి తొమ్మిది మంది వద్ద వెయ్యి ఉంటే సగటున ఒక్కొక్కరి దగ్గర 10,900 ఉన్నట్లు మధ్యగత సంపద వెయ్యే ఉంటుంది. రెండవదే వాస్తవం. అందుకే సగటు సంపదలో అమెరికా రెండవది, మధ్యగతంలో 28వది. మరో ఉదాహరణగా బ్రిటన్‌‌ను చూద్దాం. ముప్ఫయి దేశాల జాబితాలో సగటులో 21, మధ్యగతంలో 13వదిగా ఉంది. దీని అర్ధం ఏమిటంటే అమెరికా కంటే సాధారణ పౌరుల పరిస్థితి బ్రిటన్‌లో మెరుగ్గా ఉంది, అసమానతలు తక్కువగా ఉన్నట్లు. మరికొన్ని వివరాలను చూద్దాం.అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన సంపద విలువ.

దేశం — మధ్యగత– సగటు– గినీ
చైనా — 27,273 — 75,731 — 70.9
భారత్ —3,755—– 16,500— 80.2
పాక్ ——2,076——- 5,226— 74.4
బంగ్లా—- 3,842——- 9,786— 75.0
నేపాల్— 1,685 ——4,672 —-77.6
శ్రీలంక —8,615—- 23,991—- 77.2

ఎగువన ఉన్న అంకెలు చెబుతున్నదేమిటి? గినీ కోయఫిషియంట్ ప్రాతిపదికన 0 నుంచి 100వరకు పాయింట్లను చూస్తే ఎంత తక్కువ ఉంటే అంతగా అసమానతలు తక్కువగా, ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఎక్కువ ఉన్నట్లు పరిగణిస్తారు. ఇదే విధంగా సగటుతో పోల్చినపుడు మధ్యగత ఎక్కువగా ఉంటే జనాల రాబడి లేదా సంపద ఎక్కువగా ఉన్నట్లు. ఈ వివరాల ప్రకారం చైనాలో కూడా సంపద అసమానతలు ఉన్నాయి. మనదేశం, ఇతర ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే తక్కువగా గిని ఉందంటే అర్ధం అసమానతలు తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మనం అగ్ర స్థానంలో ఉన్నాం. అమెరికాలో 77 ఉంది. ప్రజాస్వామిక దేశాలలో ఇంతగా అసమానతలు ఉండటం ఏమిటి? అక్కడే తొలి ట్రిలియనీర్-ఎలన్‌మస్క్ అవతరించాడు. మన నేతలు జీడీపీ చూశారా ‘యుపిఏ హయాంకంటే మేం పెంచాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీడీపీ అంటే సంపద కాదు, ఒక ఏడాదిలో వస్తువులు, సేవల ద్వారా సృష్టించిన ఉత్పత్తి విలువ. తాము 2024 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల స్థాయికి జీడీపీని పెంచుతామని మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. మోడీ అధికారంలోకి వచ్చినపుడు 2014లో 2.04లక్షల కోట్లుగా ఉన్నది 2026లో 4.15లక్షల కోట్లకు(అంచనా) చేరింది. ఇప్పుడు 2029 నాటికి ఐదు లక్షల కోట్లకు చేరుస్తామని కొత్త గడువు చెప్పారు.

సోవియట్ యూనియన్ రద్దయిన తరువాత రష్యాలో ఉన్న ప్రభుత్వ సంపదలన్నింటినీ కొంతమంది పెద్దలు కొట్టేశారు. అమెరికా నయా ఉదారవాద పెట్టుబడిదారీ మేధావులు ఇచ్చిన సలహాల మేరకు ఇది జరిగింది. పుతిన్ ఇతర నేతలు వారి సలహాను పాటించారు గనుక రష్యా పోటీకి రాకుండా ఉండేందుకు ధనికదేశాల్లో ఒకటిగా పరిగణించి రాజీమార్గంగా జి7 కూటమిని జి8గా కూడా మార్చారు. అయితే ఆ ప్రయోగం వికటించింది. ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు రష్యా ఒకటి. ఇక గల్ఫ్ దేశాలలో ఐక్య అరబ్ రిపబ్లిక్(యుఏయి) అసమానతలు విపరీతంగా ఉన్న సమాజం. దాని జనాభాలో కేవలం 13శాతం మంది మాత్రమే పౌరులు, మిగిలిన వారంతా వలస కూలీలే. ఆధునిక బానిసదేశంగా దాన్ని పరిగణిస్తారు. సంపదల అసమానతల గురించి ఫ్రెంచి ఆర్థికవేత్త గాబ్రియెల్ జక్‌మాన్ చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో కేవలం 19 మంది ధనికుల వద్ద 14శాతం వరకు జాతీయ ఆదాయం పోగుపడింది. దాని చరిత్రలో ఎన్నడూ సంపద ఇలా కేంద్రీకతం కాలేదు.

పదిశాతం ధనికుల వద్ద 50 శాతం ఆదాయ వృద్ధి ఉండగా దిగువ 50శాతం మంది వద్ద 15 నుంచి 20శాతమే ఉన్నట్లు కూడా జక్‌మాన్ చెప్పాడు.అమెరికా ఆర్థిక వ్యవస్థ వినిమయ ఖర్చు మీద ఆధారపడేట్లు చేశారు. పదిశాతం మంది ధనికులు యాభై శాతం ఖర్చు చేస్తుండగా ఇటీవలి కాలంలో దిగువ 60శాతం వాటా తగ్గిపోతున్నట్లు తేలింది.పారిశ్రామిక వద్ధి తగ్గటం, దిగుమతుల మీద ఆధారపడటం, కార్మికులకు వేతనాల పెరుగుదల మందగించటంతో రాబడి తగ్గటం వంటి కారణాలు అత్యధికుల్లో వినిమయం పడిపోవటానికి దారి తీస్తున్నది.1950 దశకంలో అమెరికా జీడీపీలో ఉత్పాదకరంగం వాటా 25శాతం ఉండగా ఇప్పుడు పదిశాతానికి పడిపోయింది.ఫైర్ రంగం అంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియలెస్టేట్ వాటా 1947లో పదిశాతం ఉండగా ఇప్పుడు 21శాతానికి చేరింది. ఈ రంగం వృద్ధి కార్పొరేట్ కంపెనీలు, వాటిలో పని చేసే నిపుణులకు తప్ప సాధారణ కార్మికులకు రాబడి పెరగదు. తలసరి జీడీపీ పెరగవచ్చుగానీ జనాల జీవన ప్రమాణాలు ఆమేరకు పెరగటం లేదు.

ప్రపంచ ఇనీక్వాలిటీ లాబ్ (అసమానతల ప్రయోగశాల) సమాచారం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో 40.1శాతం సంపద పోగుపడగా రాబడిలో వారి వాటా 22.6శాతం ఉంది.(కొందరి అంచనా మేరకు 2022లో 25శాతం ఉంది) బ్రిటీష్ వారి ఏలుబడిలో 1922 నుంచి 1947 వరకు రాబడిలో ఎగువ ఒకశాతం వాటా 20-21శాతం మధ్య ఉందని అంచనా. అది స్వాతంత్య్రం తరువాత 1961నాటికి 13శాతానికి తగ్గింది.1991 నుంచి అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా బ్రిటీష్ కాలం నాటి కంటే సంపద, రాబడి కేంద్రీకరణ ఎక్కువైంది. అమెరికాలో పాతకాలం నాటి రాక్‌ఫెల్లర్, ఫోర్డ్, జెపి మోర్గాన్ వంటి వారిని వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బెర్గ్ వంటివారు ఎలా ముందుకు వచ్చారో మనదేశంలో టాటా, బిర్లా, గోయంకాలను దాటి అంబానీలు, అదానీలు దూసుకుపోవటాన్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఆదాయ అసమానతల పెరుగుదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అమెరికాలో 2025 వివరాలను చూసినపుడు ఒక కంపెనీ సిఇఓ-కార్మికుడి వేతన వ్యత్యాసం ఆకాశానికి అంటినట్లు తేలింది. టెస్లా కంపెనీలో ఒక కార్మికుడి మధ్యగత ఆదాయం కంటే దాని అధిపతి ఎలన్ మస్క్‌కు 25లక్షల రెట్లు ఉందన్నది నమ్మలేని నిజం.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్-సిఐఓ వార్షిక వేతన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 500 కంపెనీల జాబితాను పరిశీలించినపుడు మధ్యగత వేతనంతో పోల్చితే ఉన్నతాధికారులకు 285రెట్లు అదనంగా ఇస్తున్నారు. ఇదే కంపెనీల సిఇఓల వేతనం 1,700శాతం ఎక్కువ. ఈ వ్యత్యాసం అన్ని రంగాలలో ఒకే విధంగా లేదు. ఉత్పాదకరంగంలో ఏడాదికి సగటున ఒక సిఇఓ 69.6 కోట్ల డాలర్లు పొందుతుండగా కార్మికుడు 93వేల డాలర్లు మాత్రమే తీసుకుంటున్నాడు.అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారానికి రావటానికి ముందు కంటే గతేడాది అతగాడి రాబడి 254 రెట్లు పెరిగింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ ట్రంప్ కుటుంబ క్రిప్టో కరెన్సీ కంపెనీ, దాన్నుంచి గతేడాది 220 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందాడు. ఈ మొత్తం ఒక సాధారణ అమెరికన్ కార్మికుడి రాబడితో పోల్చితే 43,154 రెట్లు ఎక్కువ. స్టాక్‌మార్కెట్‌లో మన కార్పొరేట్, పెద్ద కంపెనీల సిఇఓల వేతనం సాధారణ కార్మికుడి మధ్యగత వేతనం కంటే రెండువందల రెట్లు ఎక్కువ, అమెరికా తరువాత అంత తేడా ఉన్న ఘనత మనదే, ఎటువైపు పయనిస్తున్నట్లు!